ఇండియాలో డైనోసర్లకు సజీవ సాక్ష్యం!

dinosaur-fossil fouind in gujaratఒకప్పుడు ఇండియాలోనూ డైనోసర్లు తిరిగాయనడానికి మరో సాక్ష్యం లభించింది. గుజరాత్ లోని కచ్ రీజియన్లో జర్మనీ జియాలజిస్టుల బృందంతో కలిసి తవ్వకాలు జరుపుతుండగా డైనోసర్ శిలాజాలు కనిపించడంతో ఆశ్చర్యపోయినట్టు భారత జియాలజిస్ట్ గౌరవ్ చౌహాన్ మీడియాకు తెలిపారు.

ADVERTISEMENT

భుజ్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో డైనోసర్ ఎముకలు లభించాయని, ఇది ఎంతకాలం క్రితం మరణించిందో తెలుసుకునేందుకు ప్రస్తుతం కార్బన్ డేటింగ్ పరీక్షలు జరుపుతున్నామని వివరించారు. గుజరాత్ ప్రాంతంలో ఇప్పటికే పలుమార్లు డైనోసర్ల శిలాజాలు లభించిన సంగతి తెలిసిందే.

గతంలో అహ్మదాబాద్ కు 100 కి.మీ దూరంలో భారీ సంఖ్యలో డైనోసర్ గుడ్లు కూడా వెలుగుచూశాయి. ముఖ్యంగా నర్మదా నది తీరంలో డైనోసార్లు తిరుగాడాయని పురాతత్వవేత్తలు నమ్ముతున్నారు. అంటే హాలీవుడ్ సినిమాల్లో చూసిన డైనోసార్లు భారత భూభాగంలో అంతర్భాగమై ఉన్నాయన్నమాట.

ADVERTISEMENT
Latest Stories