‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడి రియల్ ‘లవ్ స్టోరీ’

Director - Ajay-Bhupathiఇటీవల టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన “ఆర్ఎక్స్ 100” సినిమాను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, ఈ నెల 25వ తేదీన ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు శిరీషను వివాహం చేసుకోబోతున్నట్లుగా స్వయంగా అజయ్ భూపతే ప్రకటించారు. ఈ సందర్భంగా తన ‘లవ్ స్టోరీ’ని క్లుప్తంగా వివరించారు అజయ్.

రెండు సంవత్సరాల క్రితం తాను శిరీషకు ప్రపోజ్ చేసానని, కానీ అప్పట్లో ఆదాయం లేని కారణంతో పెద్దవాళ్ళు పెళ్లికి అంగీకరించలేదని, దీంతో వారి దగ్గర రెండేళ్ళ సమయం కావాలని అడిగానని, “ఆర్ఎక్స్ 100” ట్రైలర్ రిలీజ్ తర్వాత వారికి నమ్మకం పెరిగిందని, సినిమా హిట్ టాక్ వచ్చిన తర్వాత పెళ్ళికి ఓకే చెప్పారని తన ప్రేమకధను తెలిపారు.

ADVERTISEMENT

శిరీష బిటెక్ చదువుకుందని, తమది ఆత్రేయపురం అయినప్పటికీ, వివాహం హైదరాబాద్ లోనే జరుగుతుందని స్పష్టం చేసిన అజయ్, ప్రస్తుతం ఫుల్ ఖుషీలో ఉన్నారు. రెండు రోజుల క్రితమే ‘ఆర్ఎక్స్ 100’ నిర్మాత నుండి ఓ జీప్ ను బహుమతిగా అందుకుని ఆనందంలో ఉన్న అజయ్, తన పెళ్లి వార్తను మరింత హుషారుగా చెప్పుకొచ్చారు.

ADVERTISEMENT
Latest Stories