‘క్రిష్ – రమ్య’ల నిశ్చయ తాంబూలం!

Director Krish Engagementతెలుగు సినీ దర్శకుల జాబితాలో తనకంటూ ఒక ప్రత్యేకతను సృష్టించుకున్న దర్శకుడు క్రిష్ సరికొత్త అవతారం దాల్చాడు. ఇప్పటివరకు ఒక దర్శకుడు, రచయితగా కనిపించిన క్రిష్, మొదటిసారిగా పెళ్లికొడుకు గెటప్ లో ముస్తాబయ్యాడు. త్వరలోనే డాక్టర్ రమ్యను వివాహం చేసుకోబోతున్న జాగర్లమూడి, అందుకు తగిన ముహూర్తం నిర్ణయించుకునే వేదిక అయిన నిశ్చయ తాంబూల వేడుకను జరుపుకుంటున్నాడు.

ADVERTISEMENT

హోటల్ ట్రైడెంట్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎలాంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరుగుతోంది. “గౌతమీపుత్ర శాతకర్ణి” హీరో బాలకృష్ణ విచ్చేసి కాబోయే నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సందర్భంగా కాబోయే కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్తూ హల్చల్ చేస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories