మైండ్ అంతా అల్లకల్లోలం – ‘రాధే శ్యామ్’ డైరెక్టర్!

Director Radha Krishna Kumar - Radhe shyam postponementప్రస్తుతం చాలా టఫ్ టైం నడుస్తోందని, గుండెలు వీక్ అయిపోయాయని, మైండ్ అంతా అల్లకల్లోలంగా ఉందని, జీవితం మనకు ఎలాంటిది ఇచ్చినా, మన అంచనాలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి, సేఫ్ గా ఉండండి, హై గా ఉండండి – రాధే శ్యామ్ టీమ్ చేసిన ప్రకటనగా చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్ చేసారు.

ADVERTISEMENT

ఈ సంక్రాంతి లైన్ లో ఉన్న ఏకైక పెద్ద సినిమా “రాధే శ్యామ్” కావడం, ఈ సినిమా రిలీజ్ పై అనేక సందేహాలు నెలకొన్న నేపథ్యంలో… దర్శకుడు రాధాకృష్ణ చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. దీనికి ప్రతిగా ఓ అభిమాని ‘ఇన్ డైరెక్ట్ గా పోస్ట్ పోన్ అంటున్నారా’ అని ప్రశ్నించగా, అలాంటిది ఏమైనా ఉంటే డైరెక్ట్ గా అఫీషియల్ గా చెప్తామంటూ బదులిచ్చారు దర్శకుడు రాధాకృష్ణ.

అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అయినా కాకున్నా గానీ, మొత్తం రెడీ చేసి పెట్టే విధంగా ఓ పక్కన పోస్ట్ ప్రొడక్షన్ మరియు ఇతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కన్నడ భాషలో ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ‘రాధే శ్యామ్’ వాయిదా అనివార్యం కావచ్చు.

అయితే అనుకూల పరిస్థితులు ఉంటే మాత్రం, సంక్రాంతి అవకాశాన్ని జారవిడుచుకుకోకుండా సినిమాను అయితే అన్ని భాషలలో సిద్ధం చేస్తున్నారు. ‘భీమ్లా నాయక్, ఆచార్య’ సినిమాలు చేసిన తప్పులను ‘రాధే శ్యామ్’ ప్రొడక్షన్ యూనిట్ చేయకుండా, ఫైనల్ ప్రోడక్ట్ ను అయితే రెడీగా ఉంచుతోంది. ఈ వారాంతంలో పరిణామాలను బట్టి ఓ ప్రకటన ఉండొచ్చన్నది ట్రేడ్ టాక్.

ADVERTISEMENT
Latest Stories