“ఊపిరి” ఆడియో – పూలు, పళ్ళు అయితే నేనే విసిరేవాడ్ని!

Director  raghavendra rao speech in oopiri audio launchవంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సంస్థ నిర్మించిన “ఊపిరి” ఆడియో వేడుక వైభవంగా జరుగుతోంది. వరుసగా విడుదల అవుతున్న పాటల వీడియో టీజర్స్ ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉండగా, ఈ సినిమాలో తమన్నా అద్భుతంగా కనిపించిన ఒక పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పాటను విడుదల చేయాల్సిందిగా ఒక రిమోట్ ను దర్శకేంద్రుడి చేతికి యాంకర్ సుమ ఇవ్వగా, ఆ రిమోట్ ను నిర్మాత అశ్వనీదత్ చేతికి అందించి, సుమ చెవిలో… ‘పూలు, పళ్ళు అయితే నేనే విసిరేవాడ్ని…’ అంటూ చెప్పగా, దాన్ని సుమ మళ్ళీ బహిరంగంగా పలికింది. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియంలో నవ్వులు పూలు పూసాయి.

ADVERTISEMENT

ఆ తర్వాత ప్రసంగించిన… దర్శకేంద్రుడు… “శివ సమయంలో నాగార్జున ఎప్పుడూ సీరియస్ గా ఉండేవాడని, కానీ ఇప్పడు నవ్వుతూ కనపడుతున్నాడని, నాగ్ నీ నవ్వు బాగుంటుంది, నువ్వు ఎప్పుడూ అలాగే నవ్వుతూ ఉండాలని, ఈ ఊపిరి సినిమా విజయవంతం కావాలని” ఆకాక్షించారు.

ADVERTISEMENT
Latest Stories