ఒకప్పుడు టీచర్ గా పాటలు చెప్పిన శివ నిర్వాణ ఇప్పుడు డైరెక్టర్ గా మారి సినిమాలు తీస్తున్నాడు. పాఠాలు చెబుతున్న సమయంలోనే సినిమాలపై ఉన్న ఆసక్తి అతడిని ఇండస్ట్రీ వైపు అడుగులు వేసేలా చేసింది. అలా వచ్చిన శివ దర్శకుడిగా లిరిక్ రైటర్ గా మెప్పిస్తున్నాడు. ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కు ఒక్కో స్టైల్ ఉంటుంది. శివ నిర్వాణ కు కూడా ఒక స్టైల్ ఉంది. అతడి సినిమాలు అన్నీ కూల్ గా వినోదాత్మకంగా ఉంటాయి. కామెడీ…లవ్ సమపాళ్లలో ఉంటాయి. మొదట రామ్ గోపాల్ వర్మ దగ్గర శివ అసిస్టెంట్ గా పని చేశాడు.
2011 లో పరశురామ్ దర్శకత్వం లో వచ్చిన సోలో సినిమాకు కూడా పనిచేశాడు. ఇక 2017లో నాని హీరోగా నిన్ని కోరి సినిమాను తీసి హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రేక్షకుల మనసు దోచేసింది. లవ్ ఫెయిల్యూర్ సినిమా అయినప్పటికీ ఎక్కడ నవ్వించాలో అక్కడ నవ్వించి ఎక్కడ ఏడిపించాలో అక్కడ ఏడిపించాడు. 2019 లో మజిలీ తో పలకరించాడు. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది. ఆ తరవాత మరోసారి నాని హీరోగా టక్ జగదీష్ తో వచ్చాడు. కానీ ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు శివ విజయ్ దేవర కొండ సమంత హీరో హీరోయిన్ లుగా ఖుషి సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమా పాటలు ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించాయి. అయితే ట్రైలర్ పై కొంత నెగిటివ్ టాక్ కూడా ఉంది. ట్రైలర్ లోని కొన్ని సీన్ లు సీతారామం, అంటే సుందరానికి సినిమాలను గుర్తు చేసేలా ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు విజయ్ లైగర్ తో ప్లాట్ అందుకుని కొంత నెగిటివిటీని సంపాదించుకున్నాడు. దాంతో ఖుషి పై కొంతమంది డౌట్ పడుతున్నారు.
అయితే శివ నిర్వాణ మేకింగ్ విషయం లో సందేహం అవసరం లేదు. ప్రేమ కథలు తీయడం లో శివ దిట్ట అనే చెప్పాలి. మజిలీ, నిన్ను కోరి సినిమాలు ప్రేక్షకులను మాయలో పడేశాయి. కాబట్టి ఇప్పుడు ఖుషి పై కూడా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవచ్చు. మరి శివ నిర్వాణ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలంటే సినిమా రిలీజ్ వరకూ వెయిట్ చేయాల్సిందే.



