అంత పర్ఫెక్షన్ సుకుమార్ వల్ల అవుతుందా?

Director Sukumar Web Seriesస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్ పుష్ప ను ప్రారంభించడానికి ఎదురుచూస్తున్నాడు. అక్టోబర్‌లో షూట్ ప్రారంభించాలని బృందం యోచిస్తున్నట్లు మనకు ఉన్న సమాచారం. వారు 40 రోజుల నిడివి గల షెడ్యూల్‌ను ఎటువంటి విరామం లేకుండా మరియు ఒకే ప్రదేశంలో ప్లాన్ చేస్తున్నారట.

ADVERTISEMENT

“చలన చిత్ర షూట్‌లో దాదాపు 40-50% ఒకే లొకేషన్ లో జరుగుతుంది. ఒకే షెడ్యూల్ లో దీనిని పూర్తి చేసే ఆలోచన చేస్తున్నారు.చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ షెడ్యూల్ ని పూర్తి చేస్తాడని సుకుమార్ మీద నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు” అని బృందంలోని ఒక మూలం మాకు తెలిపింది. సహజంగా సుకుమార్ కు లేట్ లతీఫ్ గా పేరు. ఒకవేళ ఇది కుదిరితే విశేషమే.

శేషాచలం అడవులలో ఎర్రచందనం స్మగ్లింగ్ గురించి చెప్పే ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా కనిపిస్తాడు. ప్రస్తుతానికి, సమ్మర్ 2021 కోసం సినిమాను విడుదల చేయాలనేది ప్రణాళిక. ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ బరువు తగ్గే పనిలో పడ్డాడట. అలాగే చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడటానికి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత స్వరకర్త. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ ఇప్పటికే జరుగుతున్నాయి. గతంలో అల్లు అర్జున్, సుకుమార్, దేవిల కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 వంటి మ్యూజికల్ బ్లాక్ బూస్టర్లు వచ్చాయి. ఈ చిత్రం కోసం ఇప్పటికే దేవి పలు పాటలు సిద్ధం చేశాడని సమాచారం.

ADVERTISEMENT
Latest Stories