డ్రగ్స్ కేసు – ఈర్ష్యగా ఉందన్న సుకుమార్!

Director sukumar responds on Director Puri Jagannadh Drugs Caseడ్రగ్స్ కేసులో తన పేరును మీడియా పదే పదే ప్రసారం చేయడంపై దర్శకుడు పూరీ జగన్నాధ్, ఎంత ఆవేదనకు లోనయ్యారో ఓ వీడియో ద్వారా పూరీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూరీ పరిస్థితి ఇలా ఉంటే, ఇతర దర్శకులు పూరీ గురించి ఏమనుకుంటున్నారు? ఇదే ప్రశ్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ని అడిగితే ఏమన్నారో తెలుసా… పూరీ చూస్తే చాలా ఈర్ష్యగా అనిపించిందట. ప్రస్తుతం ‘దర్శకుడు’ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న సుకుమార్ ను మీడియా వర్గీయులు పూరీ గురించి అడుగగా ఇదే జవాబిచ్చారు.

ADVERTISEMENT

అయితే ఆ ఈర్ష్య ఎందుకో కూడా స్పష్టంగా తెలిపారు సుకుమార్. ఎందుకంటే… పూరీ గారికి ఓ మంచి కధ దొరికేసింది… నిజం చెప్తున్నా… ఈ పాటికే దీనిపై ఓ కధ ఆలోచించేసి ఉంటారని నవ్వులు చిందించిన సుకుమార్, దీని నుండి క్లీన్ చీట్ తో బయటకు వస్తారన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు సుక్కూ. నిజానికి సినీ అభిమానులు కూడా సుక్కూ మాటలు నిజం కావాలని కోరుకుంటున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ పూరీపై ఉన్న అభియోగాలన్నీ రూపుమాపేలా ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తే చాలంటున్నారు అభిమానులు.

ADVERTISEMENT
Latest Stories