జాతీయ స్థాయిలో సంచలన అంశం పై తేజ సినిమా

Director -Teja - Article 370- Bollywood movie ఇటీవలే సుప్రీం కోర్టు దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అయోధ్యలోని రామమందిరం విషయంలో తుది తీర్పు వెలువరించింది. వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని కోర్టు తీర్పు చెప్పింది. ముస్లింలకు మరో చోట ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని తీర్పు ఇచ్చింది. దీనితో భవ్యమైన రామ మందిరం నిర్మాణానికి సిద్ధం అవుతుంది.

ADVERTISEMENT

ఇప్పుడు ఈ ఉదంతంపై హీరోయిన్ కంగనా రనౌత్‌ ఒక సినిమా నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు డైరెక్టర్ తేజ ఈ మధ్యలో సెన్సేషన్ ఐన ఆర్టికల్ 370 పై సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఈ అంశం ఆధారంగా ఆయన ఓ కథ రాశారని సమాచారం. ఆ కథను ఓ ప్రముఖ నిర్మాత తెరకెక్కించనున్నారట.

అవకాశం వస్తే తెలుగు, తమిళ, మలయాళ, హిందీ బాషలలో ఈ సినిమాను చెయ్యాలని తేజ ప్రయత్నం. గోవాలో ఈ కథకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని వినికిడి. ఈ చిత్రంలో నటించడానికి అమితాబ్‌ సుముఖంగా ఉన్నారట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని ఫిలింనగర్‌ వర్గాల సమాచారం.

చాలా సంవత్సరాల ప్లాపుల తరువాత తేజ రానా నేనే రాజు నేనే మంత్రితో విజయం సాధించారు. అయితే వెంటనే సీత అనే సినిమాతో మరో ప్లాప్ మూటగట్టుకున్నారు. ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో సినిమా చేసే అవకాశం రావడం అదృష్టమని చెప్పుకోవాలి. దీనిని తేజ వాడుకుంటాడో లేదో చూడాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories