
తమిళనాడు ఎన్నికలలో అధికార డీఎంకే అధినేత స్టాలిన్‌తో సహా ఆ పార్టీ ఓడిపోయింది. కానీ కేవలం రెండు మూడు రోజుల్లోనే ఆ షాక్ నుంచి తేరుకొని చురుకుగా రాజకీయాలు చేస్తుండటం విశేషం. తమ ఓటమికి కారణమైన టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకి సహకరిస్తుండటం మరో విశేషం.
టీవీకే పార్టీకి 108 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నందున అత్యవసరంగా కనీసం మరో 10-12 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.
డీఎంకే వద్ద 73 మంది, అన్నాడీఎంకే వద్ద 53 మంది ఎమ్మెల్యేలున్నారు. ఒకవేళ విజయ్ కోరితే రెండు పార్టీలు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కానీ అయన ఇష్టపడటం లేదు.
కానీ విజయ్ అడగనప్పటికీ డీఎంకే అధినేత స్టాలిన్ తమ కూటమిలో పార్టీలను ఆయనకు మద్దతు ఇచ్చేందుకు ప్రోత్సహిస్తున్నారు. అందువల్లే వామపక్షాలు, వీసీకే పార్టీలు విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
తమతో కలిసి ఉన్న కాంగ్రెస్ పార్టీ టీవీకే పార్టీకి మద్దతు ఇస్తే దానిపై తీవ్రంగా విరుచుకుపడిన స్టాలిన్, ఇతర పార్టీలను స్వయంగా విజయ్ వద్దకు ఎందుకు పంపుతున్నారు? అనే సందేహం కలుగక మానదు.
ఎందుకంటే, తమిళనాడులో అన్నాడీఎంకే ముసుగులో బిజేపి అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకేనని చెప్పవచ్చు. రాష్ట్రంలో బిజేపి అధికారంలో లేకపోయినా తమిళనాడు రాజకీయాలను శాశిస్తోంది.
ఒకవేళ విజయ్ ఈ ఒత్తిళ్ళు భరించలేక అన్నాడీఎంకే మద్దతు స్వీకరించడానికి సిద్ధపడితే, ఆయన కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లు వినాలి. చేయాలి. ఆవిధంగా రాష్ట్రంలో బిజేపి పెత్తనం మొదలవుతుంది. అది ద్రవిడ పార్టీలకు ఇష్టం లేదు.
ఇదే కారణంతో బిజేపితో పొత్తులో ఉన్న అన్నాడీఎంకే కూడా దానిని వదిలించుకోవడానికి సిద్ధమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కనుక తమిళనాడులో అన్ని ద్రవిడ పార్టీలు బిజేపిని అడ్డుకోవాలనే ఆలోచనతోనే విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్నట్లు భావించవచ్చు.
ముందు బిజేపిని అడ్డుకుంటే, ఆ తర్వాత బొటాబొటి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసే టీవీకే పార్టీని దాని అధినేత విజయ్‌ని ముప్పతిప్పలు పెట్టి గద్దె దించడం వాటికి పెద్ద సమస్య కానేకాదు.
Following the commercial success of Psycho in 2020, director Mysskin completed the shooting for his…
Drishyam: The Conclusion has been a big box-office success. Trade experts can't predict exactly where…