ఏడు యుద్ధాలు ఆపిన ఘనుడు 8వ యుద్ధం ఆపలేకపోతున్నారే!

Donald Trump’s Iran War Claims Backfire Amid Escalation

ఉర్దూలో ఓ సామెత ఉంది. వెయ్యెలుకలు తిన్న పిల్లి హజ్ యాత్రకు బయలుదేరిందని! ట్రంప్‌ తీరు కూడా అచ్చం అలాగే ఉంది.

ఏడు యుద్ధాలు ఆపాను. కోట్ల మంది ప్రాణాలు కాపాడాను. నోబుల్ శాంతి బహుమతికి నా కంటే అర్హుడు ఎవరున్నారు ఈ లోకంలో? అని అడిగేవారు.

ADVERTISEMENT

ఆయన మాటలు నమ్మి నోబుల్ బహుమతి ఇచ్చి ఉంటే ఆ కమిటీ కుర్రోళ్ళు తమ చెప్పుతో తాము కొట్టుకోవాల్సి వచ్చేది. అదృష్టం కొద్దీ… జస్ట్ మిస్!

ట్రంప్‌ శాంతి ప్రవచనాలు ఎందుకు నిలిచిపోయాయో తేలీదు కానీ ఇరాన్‌ మీద యుద్ధం మొదలుపెట్టేశారు. కానీ నా అంతటివాడు లేడనుకొని యుద్ధం మొదలుపెట్టడమే పెద్ద పొరపాటని, మిత్ర దేశాలు హ్యాండిచ్చినప్పుడు కానీ ట్రంప్‌కి అర్థం కాలేదు.

చేతికి, కాలికీ అంటుకున్న చమురు జిడ్డు అంత త్వరగా వదలదు. కనుక వదిలించుకోలేక ట్రంప్‌ చాలా అవస్థ పడుతున్నారు. కానీ ఈ విషయం నలుగురికీ తెలిస్తే నవ్వుకుంటారని ఇరాన్‌ మీద బాంబులు వేయిస్తూ, ‘ఇరాన్‌ పని ఫినిష్’ అని గొప్పగా చెప్పుకుంటున్నారు.

తాజా నిదర్శనం కోసం టెహ్రాన్-కారాజ్ నగరాలను కలుపుతూ ఇరాన్‌ ప్రభుత్వం నిర్మించుకుంటున్న వంతెనపై బాంబులు వేసి కూల్చేసి ఆ ఫోటో పెట్టుకున్నారు ట్రంప్‌.

అయన ఆ ఫోటో పెట్టుకొని ఈ మాట చెప్పుకుంటున్న సమయంలోనే ఇరాన్‌ కూడా అమెరికా అత్యాధునిక రాడార్ లేదా యుద్ధ విమానాన్ని కూల్చేసి సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పెట్టింది!

‘ఇరాన్‌తో యుద్ధం మాకు చిన్న వీకెండ్ పిక్నిక్ వంటిది’ అని ట్రంప్‌ గొప్పగా చెప్పున్నారు. కానీ అలాంటి 5 వీకెండ్స్ అయిపోయాయి. కానీ పిక్నిక్ ఇంకా ముగియలేదు! ఇంకా ఎప్పుడు ముగుస్తుందో ట్రంప్‌కి తెలియదు కానీ ఇరాన్‌కు తెలుసు!

‘అమెరికా పశ్చాతాపపడే వరకు, ఓటమి అంగీకరించి క్షమాపణలు చెప్పుకునే వరకు యుద్ధం ఆగదు’ అని తేల్చి చెప్పేసింది. కనుక పాపం ట్రంప్‌ ఇప్పుడు అయిష్టంగానైనా ఇరాన్‌తో యుద్ధం చేయక తప్పడం లేదు.

నాడు పాక్‌ పాలకులు వచ్చి ఆయనని బ్రతిమాలుకొని యుద్ధం ఆపించుకున్నారట. మరిప్పుడు అయన ఎవరిని బ్రతిమాలుకోవాలో? మోడీజీ?

ADVERTISEMENT
Latest Stories