ఈ మంచితనం ఇక నా వల్ల కాదు: ట్రంప్‌

Donald Trump Warns Iran, Sparks Global Tension Debate

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ తన ‘ట్రూత్’ సోషల్ మీడియాలో ఓ పచ్చి అబద్దం చెప్పారు. ఇరాన్‌ అణు కార్యక్రమంపై దౌత్యపరమైన చర్చలు ఫలించకపోతే తాను ఇక ఎంత మాత్రం మంచివాడిగా ఉండదలచుకోలేదని స్పష్టం చేశారు.

దౌత్య పద్ధతిలో ఇరాన్‌కు అర్థం కాకపోతే తగిన విధంగా అర్ధమయ్యేలా చేస్తామని హెచ్చరించారు. ఈ విషయం నొక్కి చెప్పేందుకు రైఫిల్ పట్టుకొని ఫోటో దిగి ‘ట్రూత్’లో పోస్ట్ చేశారు. ఇకనైనా ఇరాన్‌ తెలివిగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నానని లేకుంటే సర్వనాశనం తప్పదని ట్రంప్‌ హెచ్చరించారు.

ADVERTISEMENT

ట్రంప్‌ తాను చాలా మంచివాడినన్నట్లు, ఇకపై చెడ్డవాడిగా మారిపోతానంటూ తుపాకీ పట్టుకొని ఫోటో దిగి ఇరాన్‌ని బెదిరించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచే ప్రపంచ దేశాలను వేదిస్తున్నారు. తీవ్రంగా నష్టపరుస్తున్నారు.

చిత్ర విచిత్రమైన నిర్ణయాలతో అమెరికాను కూడా ఆర్ధికంగా బలహీన పరుచుకొని, దేశం పరువు నయగారాలో కలిపేస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రపంచ దేశాల నుంచి ముక్కు పిండి వసూలు చేసిన సుంకాలను వాపసు చేయాల్సి రావడం ట్రంప్‌ అనుచిత నిర్ణయాలకు పర్యవసానమే కదా? రేపు ఇరాన్‌ విషయంలో కూడా ఇలాగే జరిగితే అమెరికా పరిస్థితి ఏమిటి?

ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ నియమ నిబంధనలన్నీ బేఖాతరు చేస్తూ ఇరాన్‌ మీద యుద్ధం ప్రారంభించి వందల మంది ప్రాణాలు బలిగొన్న ట్రంప్‌ తనని తాను మంచివాడుగా అనుకోవడం అహంభావం వల్లనే అని చెప్పక తప్పాడు. ఒకవేళ ఆయనలో ఇంకా ఏ మాత్రం మంచితనం మిగిలున్నా తక్షణం ఇరాన్‌కు క్షమాపణలు చెప్పి, దానికి చేసిన నష్టానికి పరిహారం చెల్లించి ఉండేవారు.

కానీ పెరట్లో గుట్టగుట్టలుగా అణ్వాయుధాలు పోగేసుకొని, వాటితో ఇరాన్‌ని సర్వనాశనం చేస్తామని బెదిరిస్తున్నారు. ఇరాన్‌ మాత్రం అణ్వాయుధాలు తయారుచేయకూడదని, వాటిని తమకు అప్పగించాలని ట్రంప్‌ హుకుం జారీ చేయడం, లేకుంటే ఇరాన్‌ని సమూలంగా తుడిచిపెట్టేస్తానని బెదిరిస్తుండటం మంచితనమా?

చేయకూడని తప్పులు, నిష్కృతి లేని పాపాలు చేస్తూనే ఇంకా ‘నేను మంచివాడినే’ అని ట్రంప్‌ అనుకోవడం సిగ్గుచేటు.

ADVERTISEMENT
Latest Stories