వారణాసి స్ట్రాటజీ ఫాలో అవుతున్న డ్రాగన్

Dragon Movie Promotions

వారణాసి సినిమా ఎలా ఉండబోతోంది అని రాజమౌళి రిలీజ్ చేసిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో.. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాకి గత ఏడాది నుండే థియేటర్లలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. అలాగే.. హాలీవుడ్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమా మీద హైప్ మరింత పెంచారు.అయితే.. వారణాసి పాన్ వరల్డ్ సినిమా కాబట్టి, ఈమాత్రం ప్రమోషన్స్ తప్పదు అనుకున్నారు జనాలు మరియు ట్రేడ్ వర్గాలు.

ఇప్పుడు డ్రాగన్ టీమ్ కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ ను ఆల్రెడీ అన్నీ ప్రముఖ మల్టీప్లెక్స్ థియేటర్లలో ప్లే చేస్తున్నారు. అదే విధంగా.. సినిమా థీమ్ ని వివరిస్తూ ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఆ క్లిప్పులే వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ చాలా క్లారిటీగా కంటెంట్ నుండి ఏం ఎక్స్ పెక్ట్ చేయాలి, సినిమా ఎలా ఉండబోతోంది, ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది వంటి డీటెయిల్స్ అన్నీ చాలా విపులంగా వివరించాడు.

ADVERTISEMENT

స్కేల్ విషయంలో వారణాసి & డ్రాగన్ మ్యాచ్ అవ్వకపోయినా.. కంటెంట్ ప్రొజెక్షన్ & పబ్లిసిటీ విషయంలో మాత్రం రెండు సినిమాల బృందాలు ఒకే రీతిలో ఆడియన్స్ కు చేరువవుతున్నారు. అయితే.. అదే 2027 రిలీజ్ కి రెడీ అవుతున్న మరో రెండు సినిమాలు “స్పిరిట్” మరియు “రాకా” మాత్రం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉన్నాయి. వాళ్లు కూడా వారణాసి ఫార్మాట్ ను ఫాలో అవుతారా? లేక రెగ్యులర్ ప్రమోషనల్ స్ట్రాటజీలోనే తమ సినిమాని ప్రమోట్ చేసుకుంటారా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories