‘బతుకు’ షార్ట్ ఫిల్మ్ ద్వారా పలు అంతర్జాతీయ అవార్డ్లు పొందిన ప్రముఖ రచయిత మోహన రావు దురికిని ‘తెలుగు సినీ రచయితల సంఘం’ ఉగాది పండగ సందర్బంగా ఫిల్మ్ ఛాంబర్లో శుక్ర వారం ఘనంగా సన్మానించింది.
సీనియర్ దర్శకుడు పి సి రెడ్డి, కొడాలి వెంకటేశ్వర రావు (గౌరవ అద్యక్షుడు, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి), డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి (ఉపకులపతి, తెలుగు విశ్వవిద్యాలం), డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అమెరికా , చైనా, కెనడా కలిసి ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ‘గోల్డెన్ ఫండా’ షార్ట్ ఫిల్మ్ పోటిలో ‘బతుకు’ షార్ట్ ఫిల్మ్ టాప్ 100 షార్ట్ ఫిలిమ్స్ లో 36వ ర్యాంక్ సాదించింది. అంతేకాకుండా ఈ షార్ట్ ఫిల్మ్ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ పోటిలో రెండో బహుమతితోపాటు ‘జూరి’ అవార్డు పొందిన విషయం మీకు తెలిసిందే. ‘బతుకు’ షార్ట్ ఫిల్మ్ ద్వారా తొలిసారి దర్శకత్వం వహించిన మోహన రావు దురికి త్వరలోనే ఓ తెలుగు హారర్ కామెడీ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.



