మరో నాలుగు రోజుల్లో విజయ్ దేవరకొండ నటించిన “నోటా” సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపధ్యంలో… ఈ సినిమా పబ్లిసిటీలో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చే పనిలో విజయ్ ఉన్నాడు. అలా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “నోటా” గురించి చెప్తూ… ‘ఒకానొక దశలో ఈ సినిమా ఎందుకు చేసినానా’ అనుకున్నానని స్పష్టంగా తెలిపాడు ఈ క్రేజీ హీరో.
[m9ad]
ఈ సినిమాలో 3 పేజీల డైలాగ్ లు డైలాగ్ ఉందని, దానిని తమిళంలో చెప్పడం బాగా ఇబ్బందిగా ఉందని, దీంతో ఈ సినిమా ఎందుకు చేసినానా అనుకున్నానని, అదే తెలుగులో అయితే పది పేజీల డైలాగ్ నైనా పది నిముషాల్లోనే అద్భుతంగా చెప్పేస్తానని, తమిళ భాష రాదు గనుక ఇబ్బంది అయ్యిందని, అయినా మొత్తం డబ్బింగ్ పూర్తి చేసేసానని, ఇంకా ఒకటి, రెండు సీన్స్ కు మాత్రమే చెప్పాలని, అది రేపో, ఎల్లుండో చెప్పేస్తానని ఈ ఇంటర్వ్యూలో తెలిపాడు విజయ్.
సినిమాలోనే అత్యంత కీలకమైన సన్నివేశం అదని, ఒక రకంగా సినిమాను మలుపు తిప్పే సీన్ అని తెలిపిన విజయ్, “నోటా” అవుట్ పుట్ బాగా వచ్చిందని, తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులకు నచ్చుతుందని, మరో సూపర్ హిట్ తనకు దక్కుతుందన్న నమ్మకం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఇంతకుముందు సినిమాలపై చూపించని నమ్మకం “నోటా”పై విజయ్ ప్రదర్శించడం విశేషమే. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలంటె మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.



