
టి. బీజేపీ రాజకీయం కొంతమంది సీనియర్ రాజకీయ నాయకుల భవిష్యత్ కి సమాధి కడుతుందనే చెప్పాలి. ముఖ్యంగా బిఆర్ఎస్ మంత్రి గా ఉంటూ అధికార పార్టీని సైతం వదులుకుని బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఈటెల రాజేంద్రప్రసాద్ భవిష్యత్ రాజకీయం ప్రయాణం గమ్యం లేని ప్రయాణం మాదిరి తయారయ్యింది.
రాజకీయాలలో వేసే ఒక్క తప్పటడుగు ఎంతటి భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది అనేదానికి ఈటెల నిర్ణయం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. ఒక ఉద్యమ నాయకుడుగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తనవంతు పాత్ర పోషించి, పార్టీ గుర్తు కాకూండా తనకంటూ ఒక సొంత బలం, బలగాన్ని సంపాధించుకున్న ఈటెల ఇప్పుడు స్పష్టత లేని బీజేపీ రాజకీయంతో బలహీనుడిగా మిగిలిపోతున్నారు.
తెలంగాణ రాజకీయాలలో కీలక పాత్ర పోషించి, బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక, నీటి పారుదల శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఒక సాధారణ బీజేపీ పార్టీ కార్యకర్తలా, ఎటువంటి పదవి బలం లేని ఒక సామాన్య నాయకుడిగా నిస్సహాయుడిగా ఒంటరిగా ప్రయాణం సాగిస్తున్నారు ఈటెల.
అధికార పార్టీని వదులుకుని మరి ఈటెల కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ రాజకీయాలలో ఆయనకున్న అనుభవం బీజేపీ కి బలంగా మారే అవకాశం ఉన్నా అందుకు బీజేపీ ముందుకు రావడం లేదు, ఈటెల అనుభవాన్ని పార్టీ ఎదుగుదలకు వాడుకోవడం లేదు.
ఈటెల బీజేపీ తీర్ధం పుచ్చుకుని ఇన్నేళ్ళైనా పార్టీలో ఈటెల స్థాయికి తగ్గ గౌరవం, గుర్తింపు బీజేపీ ఇచ్చిందా.? అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా.? అంటే అది కూడా సందేహమే.! ఇప్పటికే బండి సంజయ్ vs ఈటెల అన్నట్టుగా బీజేపీ లో అంతర్గత పోరు నడుస్తుంది.
ఇక బీజేపీ సీనియర్ నాయకులందరూ ఒక దిక్కు ఈటెల ఒక్కరే మరో దిక్కు అన్నట్టుగా ఈటెల బీజేపీ వంటి అధికారంలో ఉన్న జాతీయ పార్టీలో ఉంటూ కూడా తన బలాన్ని పెంచుకోలేకపోతున్నారు, పార్టీకి బలం కాలేకపోతున్నారు.
బీజేపీ బిఆర్ఎస్ తో లోపాయకారి ఒప్పందాలను కుదుర్చుకుని ఆ దిశగానే రాజకీయం నడుపుతుందంటూ తెలంగాణ రాజకీయ వర్గాలలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కవిత కూడా అదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు. ఇక అధికార కాంగ్రెస్ సైతం బీజేపీ – బిఆర్ఎస్ తెరచాటు రాజకీయం నడుపుతున్నారంటూ బలంగా ప్రచారం చేస్తున్నారు.
ప్రత్యర్థుల విమర్శలకు తగ్గట్టే బీజేపీ కూడా తెలంగాణ రాజకీయాలలో కొంతకాలం తాబేలు మాదిరి షెల్ లోకి వెళ్ళిపోతుంది, మరికొంతకాలం కుందేలు మాదిరి ఎగిరెగిరి గంతులు వేస్తుంది. అయితే బీజేపీ తాబేలు కావడానికి, కుందేలుగా మారడానికి ఉన్న కారణాలేమిటి అనేది బీజేపీ క్యాడర్ కి కూడా స్పష్టత లేదు.
అలాగే తెలంగాణలో జరిగే స్థానిక ఎన్నికల సమయంలో కూడా బీజేపీ అప్పటి వరకు నానా హంగామా చేసినా అవసరమైన సమయానికి కనీసం పార్టీ పోటీలో ఉన్నట్టు కూడా చప్పుడు చెయ్యదు. తెలంగాణ రాజకీయాలు క్షుణ్ణంగా తెలిసిన నాయకుల సలహాలు కానీ వారి అనుభవాన్ని కానీ పార్టీ కోసం వాడుకోదు.
ఇటువంటి తరుణంలో బీజేపీ లో ఈటెల ఒంటరి ప్రయాణం సాధ్యమవుతుందా.? వీరందరి రాజకీయాలను తట్టుకుని తెలంగాణ రాజకీయాలలో ఈటెల తిరిగి చక్రం తిప్పగలరా.? తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ఉన్న గుర్తింపు – గౌరవాన్ని తిరిగి పొందగలరా.? లేదా కాషాయ రాజకీయాన్ని కాదని అడుగు ముందుకేస్తారా.?
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…