
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాత మిత్రులు జగన్ – కేసీఆర్ లకు సొంత కుటుంబ సభ్యుల నుండే కొత్త కష్టాలు మొదలయాయ్యి. తెలంగాణ రాజకీయాల నుండి ఏపీ రాజకీయాలకు దిగుమతి అయిన చెల్లి వైస్ షర్మిల…అలాగే తన తండ్రి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలి అంటూ న్యాయపోరాటం చేస్తున్న సునీతా…ఇలా ఇద్దరు చెల్లెల్లు కలిసి వైస్ జగన్ పై రాజకీయ యుద్ధం ప్రకటించారు.
ఇలా సొంత కుటుంబానికి చెందిన వ్యక్తులే జగన్ ప్రభుత్వాన్ని నిందిస్తూ, ముఖ్యమంత్రి జగన్ పైనా, ఆయన సతీమణి భారతి రెడ్డి పైన, వారి కుటుంబానికి చెందిన వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేస్తూ జగన్ సర్కార్ ను గద్దె దింపే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సునీతా, షర్మిలకు తోడు ఇప్పుడు వివేకా రెడ్డి సతీమణి సౌభాగ్యం కూడా జగన్ హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు అంటూ వ్యాఖ్యానించడంతో జగన్ తో పాటుగా జగన్ ప్రభుత్వం కూడా అటు వారి పై ప్రత్యక్షంగా ఎదురుదాడి చేయలేక డిఫెన్స్ మోడ్ లో పడిపోతున్నారు.
ఇలా ప్రశ్నలతో, విమర్శలతో జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ జగన్ కు రాబోయే ఎన్నికలకు కాబోయే రాజకీయ గండం గా మారిపోయారు సోదరీమణులు షర్మిల, సునీత. జగన్ పరిస్థితి ఇలా ఉంటే జగన్ రాజకీయ మిత్రుడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి వేరేలా ఉంది. ఈయనకు కూడా ఆయన సొంత కుటుంబంలోని మహిళ ద్వారానే రాజకీయ లొల్లి మొదలయ్యింది.
అసలే అసెంబ్లీ ఎన్నికలలో పదేళ్ల నుండి ఉన్న అధికారానికి దూరమయ్యామే అనే బాధలో నైరాశ్యంలో ఉన్న కేసీఆర్ కు ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ద్వారా మరో కొత్త చిక్కులు రానున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాములో ఆరోపణలు ఎదుర్కొంటు… కొన్ని సార్లు విచారణకు సైతం హాజరైన కవిత ఇంటి పైన ఐటీ దాడులు బిఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
తెలంగాణలో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల సమయంలో సాక్ష్యాత్తు కేసీఆర్ కుమార్తె ఇంటి పైనే ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఒక్కసారిగా పునరాలోచనలోకి వెళ్ళిపోతారు. హైద్రాబాద్ కవిత నివాసంలో నాలుగు బృందాలుగా విడిపోయి ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సోదాలలో భాగంగా కవితకు సంబంధించిన ఫోన్లను, పలు డాక్యూమెంట్స్ ను సీజ్ చేసారు అధికారులు. దీనితో కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దీనితో ఎన్నికల ముంగిట బిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు ఇది ఊహించని పరిణామమనే చెప్పాలి. ఈ సంక్షోభం నుండి పార్టీని కుమార్తెను కాపాడే పనిలో ఉన్నారు కేసీఆర్.
ఇలా పాత మిత్రులిద్దరు జగన్ – కేసీఆర్ కు చెల్లల్ల రూపంలో కూతుర్ల రూపంలో కొత్త రాజకీయ గండాలు పొంచి ఉన్నాయనే చెప్పాలి. ఒక్క ఓటమి ఎంతటి హీనా పరిస్థితులకు తీసుకు రాగలదో కేసీఆర్ ను ఆయన పార్టీ ని చూస్తున్న జగన్ కు వైసీపీ పార్టీ తాలూకా నేతలకు గెలుపు అవసరం ఎంతనేది అర్ధమయ్యే అవకాశం ఉంది. అధికారం ఉంది కదా అని అందరి మీద నోరు పారేసుకున్న ఈ మాజీలంతా ఇప్పుడు డమ్మీలుగా మారిపోయారు.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…