అక్కడా ఇక్కడా ఏదో జరుగబోతోంది… పక్కా!

ఏపీలో శాసనసభ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగబోతుంటే, తెలంగాణలో (17 సీట్లు) లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఇందులో పెద్ద విచిత్రమేమీ లేదు కానీ ఈ ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో పెను మార్పులు జరుగబోతున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్‌కు 8, బీజేపీకి 6, బిఆర్ఎస్ పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే లభిస్తాయని సర్వేలు చెపుతున్నాయి. కాస్త అటూ ఇటూగా ఇదే విదంగా ఫలితాలు రాబోతున్నాయి కూడా.

ADVERTISEMENT

శాసనసభ ఎన్నికలలో ఓటమితోనే ఆ పార్టీ సగం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా ఓడిపోతే బిఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే అవకాశం ఉంటుంది.

అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధాన ప్రత్యర్ధులుగా నిలుస్తాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్‌ చెపుతున్నారు.

అవి వట్టి బెదిరింపులే అని కొట్టిపడేసినా, బీజేపీ నేతల హెచ్చరికలు రేవంత్‌ రెడ్డి లైట్ తీసుకోలేరు. ఎందుకంటే గతంలో నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది కనుక!

కేసీఆర్‌ ప్రభుత్వంతో పోలిస్తే రేవంత్‌ ప్రభుత్వం చాలా బలహీనంగా ఉంది. ఆయన పట్ల అసంతృప్తిగా మంత్రులు, ఎమ్మెల్యేలు సరైన అవకాశం చిక్కితే దెబ్బతీయడానికి వెనకాడరు. కనుక లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాలలో ఏదో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఏపీలో వైసీపి ఓటమి దాదాపు ఖాయమే అని సర్వేలు చెపుతున్నాయి. మారిన రాజకీయ సమీకరణాలు, ప్రజలలో నెలకొన్న ప్రజావ్యతిరేకత, వైఎస్ షర్మిల ఎంట్రీ అన్నీ కూడా అదే సూచిస్తున్నాయి.

టిడిపి, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఏపీ రాజకీయాలలో మళ్ళీ కొత్త అధ్యాయం మొదలవుతుంది. అది ప్రజల కష్టాలు తీర్చేదిగానే ఉంటుందని అందరూ ఆశపడుతున్నారు.

కానీ ఈ ఓటములతో తెలంగాణలో కేసీఆర్‌, ఏపీలో జగన్‌, వారి పార్టీల పరిస్థితి పూర్తిగా తలక్రిందులవుతుంది. తెలంగాణలో బిఆర్ఎస్ పరిస్థితి ఇప్పటికే దయనీయంగా ఉంది. ఎన్నికల తర్వాత చచ్చిన పాము లెక్క కావచ్చు.

ఏపీలో ప్రతీకార రాజకీయాలను జగన్‌ ప్రభుత్వం పెంచి పోషించింది కనుక ఓడిపోతే దానికి తగు మూల్యం చెల్లించక తప్పక పోవచ్చు.

ఒకవేళ ఏపీలో వైసీపి గెలిస్తే టిడిపి, జనసేనలు జగన్మోహన్‌ రెడ్డిని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. కానీ బహుశః వైసీపికి మరో అవకాశం రాకపోవచ్చు. కనుక ఓడిపోతే ఎలా? ఏమి జరుగుతుంది? ఏం చేయాలి? అనివై నేతలు ముందే ఆలోచించుకొని ఎదురయ్యే పర్యవసానాలకు ‘సిద్దం’గా ఉండటం మంచిది.

ఈ ఎన్నికల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఏ పార్టీ గెలిచినా, ఓడినా పెనుమార్పులు

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

BSS Haindava Teaser: Breathtakingly Spectacular

Haindava, the upcoming film featuring Bellamkonda Sai Sreenivas, is an occult thriller thriller that promises…

12 minutes ago

స్థానికం నేర్పిస్తున్న కొత్త పాఠాలు!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో వినిపిస్తున్న వాదోపవాదాలు, అభిప్రాయాలు, సలహాల నుంచి టీడీపీ, జనసేన... రెండు పార్టీలు…

33 minutes ago