ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఇంగ్లాండ్ కు చావు దెబ్బ!

England vs Afghanistan World T20దక్షిణాఫ్రికాపై 229 పరుగులను అవలీలగా చేధించి అందర్నీ అవాక్కు చేసిన ఇంగ్లాండ్ జట్టు… నేడు ఆఫ్ఘనిస్తాన్ పై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని చతికిలపడింది. 20 ఓవర్లలో కేవలం 142 పరుగులను మాత్రమే చేసి ఆఫ్ఘనిస్తాన్ గెలవడానికి ఒక ఆశను కల్పించింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టును నియత్రించడంలో ఆఫ్ఘన్ బౌలర్లు సఫలమయ్యారు.

ADVERTISEMENT

మరో వైపు దక్షిణాఫ్రికాపై భారీ స్కోరును సాధించినంత పని చేసిన ఆఫ్ఘన్ బ్యాట్స్ మెన్లు ఈ స్వల్ప లక్ష్యాన్ని చేధించవచ్చని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకానొక దశలో 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును అలీ, విల్లీల జోడు ఆదుకుంది. 19వ ఓవర్ లో 3 భారీ సిక్సర్లతో ఏకంగా 25 పరుగులు సాధించడంతో… కనీసం ఆ మాత్రం స్కోరైనా నమోదు చేయగలిగింది. మొయిన్ అలీ 41 పరుగులతో, విల్లీ 20 పరుగులతో అబేధ్యమైన 8వ వికెట్ కు 57 పరుగులు జోడించారు.

ADVERTISEMENT
Latest Stories