ఎంత మంచివాడవురా టీజర్… మంచి పండగ సినిమా?

Entha Manchivaadavuraa Teaser - Kalyan Ram -Mehreen Pirzadaనందమూరి కల్యాణ్‌ రామ్‌ నటిస్తున్న ఎంత మంచివాడవురా చిత్రానికి సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. కాసేపటి క్రితం ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘కల్యాణ్‌రామ్‌ చాలా మంచి వాడంటూ గురించి ఆయన కుటుంబ సభ్యులు చెప్పే డైలాగులతో టీజర్‌ ప్రారంభమవుతుంది.

ఈ టీజర్‌లో కల్యాణ్‌రామ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగులతో పాటు యాక్షన్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. దానితో ఈ సినిమాలో క్లాస్ మాస్ ఆడియన్స్ కు కావలసిన అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయనే చెప్పే ప్రయత్నం చిత్ర బృందం చేసింది. గతంలో సతీశ్ వేగేశ్న సక్సెస్ ఫుల్ సంక్రాంతి సినిమా శతమానం భవతి వంటి మంచి సినిమా ఫీలింగ్ కలిగించే ప్రయత్నం చేశారు.

ADVERTISEMENT

స్టోరీ బ్యాక్ డ్రాప్ గోదావరి జిల్లాలలో ఉండటం కూడా రెండు సినిమాలలో కామన్ అనే చెప్పాలి. కల్యాణ్ రామ్ లుక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అదే విధంగా కెమెరా వర్క్ కూడా బావుంది. మొత్తానికి ఎంత మంచివాడవురా చిత్రం ప్రమోషన్స్ కు ఈ టీజర్ తో మంచి ప్రారంభం దక్కింది అనే చెప్పుకోవాలి.

ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌కు జంటగా మెహరీన్‌ నటిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో, రజినీకాంత్ దర్బార్ మరిన్ని చిన్న సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడంతో పండగకు గట్టి పోటీనే ఎదురుకోబోతుంది.

ADVERTISEMENT
Latest Stories