చంద్రబాబు ఆ గది బయట కుక్కలా పడిగాపులు కాసేవాడు

Errabelli Dayakar Rao comments on Chandrababu- Naiduటీడీపీ నుండి తెరాసలోకి మారిన ఎర్రబెల్లి దయాకరరావు తన చిరకాల కోరికైన మంత్రి పదవి ఇచ్చినందుకు కేసీఆర్ సంతోషం కోసం చంద్రబాబుని తిట్టి పోస్తున్నట్టుగా ఉంది. టీడీపీ కాలం నుండి ఆయన మిత్రుడు తలసాని శ్రీనివాసయాదవ్ ను ఇన్స్పిరేషన్ గా తీసుకునట్టున్నారు ఎర్రబెల్లి. ఈ క్రమంలో నిన్న ఆయన ఒక మాట అన్నారు. దావోస్ లో బిల్ గేట్స్ ఉన్న హోటల్ లో గది తీసుకుని చంద్రబాబు ఆయన గది బయట కలవడానికి కుక్కలా పడిగాపులు కాసేవాడు అన్నారు ఎర్రబెల్లి.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, ప్రపంచవ్యాప్తంగా విలువైన పెట్టుబడిదారుడు బిల్ గేట్స్. ఆయన గది బయట కుక్కలా పడిగాపులు కాయడం ఎర్రబెల్లి దొర గారికి నామోషీ కావొచ్చేమో చంద్రబాబుకు కాకపోవచ్చు. అలా బిల్ గేట్స్ ను ప్రసన్నం చేసుకుని హైదరాబాద్ కు అమెరికా బయట మొట్టమొదటి మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అది హైదరాబాద్ దశాదిశా మార్చేసింది అనడం అతిశయోక్తి కాదు. ఐటీ మ్యాప్ లో హైదరాబాద్ ను నిలబెట్టారు.

ADVERTISEMENT

ఆ విషయం మొన్న ఆ మధ్య ఒక వాణిజ్యవేత్తల సమావేశం యువరాజు కేటీఆర్ కూడా ఒప్పుకున్నారు. ఆ విషయం ఎర్రబెల్లి కి తెలుసో లేదో. మరోవైపు ఎర్రబెల్లి పై తెలుగుదేశం పార్టీ నాయకులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు కుక్కలా బిల్ గేట్స్ గది బయట కాపలా కాస్తే మరి ఎర్రబెల్లి ఎందుకు చంద్రబాబు గది బయట కుక్కలా పడిగాపులు కాశారు ఇన్ని సంవత్సరాలు అని వారు అడుగుతున్నారు. చంద్రబాబును తిడుతున్నా అనుకుని ఆయనను పొగిడేశారు ఎర్రబెల్లి.

ADVERTISEMENT
Latest Stories