సినిమా జోనర్ బట్టి ఎలాంటి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది, ఎలాంటి సెంటర్స్ లో ఆడుతుంది అనే అవగాహన నిర్మాతలకు కచ్చితంగా ఉండాల్సిందే. ఆ అవగాహన బట్టే వాళ్ల సినిమాలు రూపొందాలి. అలా మొదటి అడుగులోనే “90’s” అనే వెబ్ సిరీస్ తో యావత్ చిత్రసీమని అలరించిన సంస్థ ఈటీవీ విన్. నాస్టాల్జియా అనే థీమ్ ను సరిగ్గా వినియోగించుకుని సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత కూడా “అనగనగా” అనే ఫీల్ గుడ్ ఫిల్మ్ తో ఓటీటీ ఆడియన్స్ ను అలరించి, తర్వాత సెలక్టెడ్ థియేటర్లలో కూడా ప్రదర్శించి మంచి ఆదరణ చూరగొన్నారు.
ఆ ప్రాజెక్టులు సాధించిన సక్సెస్ లు, జనాల్లో సంపాదించుకున్న క్రెడిబిలిటీతో “లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి” సినిమాలు థియేటర్లలో రిలీజ్ చేసి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. వాళ్లేం చేసినా హిట్లే అనే పేరు సంపాదించుకున్నారు
కట్ చేస్తే.. సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఆస్వాదించకముందే వరుస పరాజయాలు చవిచూడాల్సి వచ్చింది. అవే.. “సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని” & “పాపం ప్రతాప్”. ఈ రెండు సినిమాలు ప్రీమియర్ల నుండే నెగిటివ్ టాక్ తో చతికిలపడ్డాయి.
అయితే.. ఈ రెండు సినిమాలు డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయ్యుంటే ఇంత నెగిటివ్ టాక్ వచ్చేది కాదు. కానీ.. అత్యాశకు పోయి థియేటర్లలో రిలీజ్ చేయడమే మైనస్ గా మారింది. ఈ పరాజయాలు అనవసరంగా ఈటీవీ విన్ క్రెడిబిలిటీని కూడా పాడు చేస్తున్నాయి.
ఈటీవీ విన్ సంస్థ ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని.. ప్రతి సినిమాని థియేటర్ల దాకా ఈడ్చుకుని రాకుండా, ఓటీటీకి సెట్ అయ్యే కంటెంట్ ని ఓటీటీకే పరిమితం చేసి, ఇంకాస్త జాగ్రత్తగా థియేట్రికల్ కంటెంట్ ను ఫిల్టర్ చేస్తే బెటర్.




