‘మిర్చి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన యువీ క్రియేషన్స్ తాజాగా నిర్మించిన సినిమా ‘ఎక్స్ ప్రెస్ రాజా.’ శర్వానంద్, సురభి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ ఫేం మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ప్రవీణ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ప్రభాస్ చేతుల మీదుగా ఘనంగా విడుదలైంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ధియేటిరికల్ ట్రైలర్ సినిమాపై పాజిటివ్ సంకేతాలను ఇచ్చింది.
క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ వుందని ట్రైలర్ స్పష్టం చేసింది. ఎప్పటిలాగానే శర్వానంద్ తన మార్క్ నటనతో ఆకట్టుకోగా, సురభి అందాలు, ప్రవీణ్ బ్యాక్ గ్రౌండ్, పంచ్ డైలాగ్స్, కార్తీక్ ఫోటోగ్రఫీ, గాంధీ దర్శకత్వ ప్రతిభ ట్రైలర్ లో కనపడుతున్నాయి. సప్తగిరి, షకలక శంకర్ ల వంటి కమెడియన్లకు తోడు రౌడీ, విలన్ పాత్రలు పోషించే వారి చేత కూడా కామెడీ చేయించినట్లుగా స్పష్టమవుతోంది. మొత్తానికి శర్వానంద్ కు మరో హిట్ ఇచ్చే సినిమాగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ నిలుస్తుందన్న భావన ట్రైలర్ కలిగిస్తోంది.





