‘మాహిష్మతి’ నగరంలో వర్షం… వీడియో రిలీజ్..!

first rains arrive in Mahishmathi‘బాహుబలి – ది కంక్లూజన్’ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. రామోజీ ఫిలిం సిటీ వేసిన సెట్ లో ఈ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ‘మాహిష్మతి’ నగర సామ్రాజ్యంలో జరుపుతున్న షూటింగ్ లో తొలిసారిగా వరుణుడు విచ్చేసాడు. దానికి సంబంధించిన ఓ 4 సెకన్ల వీడియోను కూడా రాజమౌళి తన ట్విట్టర్ ఎకౌంటు ద్వారా విడుదల చేసారు.

ADVERTISEMENT

‘ది ఫస్ట్ రైన్స్ ఎరైవ్స్ ఇన్ మాహిష్మతి…’ అంటూ ట్వీట్ చేసిన ఆ కొంచెం వీడియోనే వీక్షకులను ఆకట్టుకుంటోంది. ‘బాహుబలి’ మొదటి పార్ట్ తో పోలిస్తే… ఈ పార్ట్ పబ్లిసిటీకు దూరంగా షూటింగ్ జరుపుకుంటుందన్న టాక్ రావడంతో, ఇటీవల పలు అప్ డేట్స్ ను అందజేస్తున్నారు జక్కన్న. 2017 సమ్మర్ కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం దేశమంతా ఎదురు చూస్తున్నారు. ఎందుకోసమో తెలుసుగా..!?

ADVERTISEMENT
Latest Stories