తెలుగులో తన కెరీర్ ని ప్రారంభించిన తాప్సీని చాలా వరకు గ్లామర్ పాత్రలకే పరిమితం చేశారు. అయితే ఆ తరువాత హిందీ సినిమాలలోకి వెళ్లిన తాప్సీ తన పంథా పూర్తిగా మార్చేసింది. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ సక్సెస్ ట్రాక్ లో దూసుకునిపోతుంది. ఒక సినిమా తో మరో సినిమాకు సంబంధం లేకుండా ముందుకు వెళ్తుంది.
దీనితో ఆమెకు దేశవ్యాప్తంగా ఒక సెక్షన్ ఫ్యాన్స్ ఏర్పడ్డారంటే అతిశయోక్తి కాదు. తాప్సీ నటిస్తున్న ఇటువంటి సినిమాలు చూస్తుంటే టాలీవుడ్ ఆమెని సరిగ్గా వాడుకోలేదనే చెప్పుకోవాలి. తాజాగా ఆమె ఒక తమిళ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. అలాగే తన తదుపరి బాలీవుడ్ సినిమా… రష్మీ రాకెట్ కోసం జిమ్ కు వెళ్లి చెమటోడిస్తుంది.
రష్మీ రాకెట్ షూటింగ్ కూడా తొందరలో మొదలవుతుంది. ఈరెండు సినిమాలతో పాటు మరో మూడు సినిమాలు… మొత్తంగా ఐదు సినిమాలు వచ్చే ఏడాది విడుదలకు సిద్ధం చేస్తుంది తాప్సీ. లాక్ డౌన్ వంటి బ్రేక్ లేకపోతే ఈ ఐదు సినిమాలు 2021లో విడుదల అవ్వడం ఖాయం అంటూ ఆమె మీడియాకు చెప్పింది.
రష్మి రాకెట్ అనేది క్రీడా నేపథ్యం ఉన్న సినిమా. ఈ సినిమాలో అథ్లెట్‌గా కనిపించనున్నారామె. స్క్రీన్ మీద అచ్చమైన అథ్లెట్‌గా కనిపించడానికి వ్యాయామంతో పాటు సరైన డైట్ కూడా తీసుకుంతుంది తాప్సీ. ఆకర్ష్ ఖురానా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించనున్నారు.




