జగన్ లక్కీ ఆర్ అన్ లక్కీ..?

లక్షల కోట్ల ఆస్తి, తండ్రి రాజకీయ వారసత్వం, తానూ ఆదేశిస్తే మంచి చెడుల సంస్కారం కూడా చూడని అభిమాన బలం, జిల్లాకో ప్యాలస్, వేలమంది ప్రయివేట్ సైన్యం, కోరింది కాళ్ళ ముందుకు తెచ్చుకోగల అంగబలం జగన్ సొంత.

అలాగే, అన్నరాజకీయ భవిష్యత్ కోసం వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయగలిగిన చెల్లి, బిడ్డ పదవి, అధికారం కోసం రాజకీయ అరంగేట్రం చేసిన తల్లి, భర్త రాజకీయ జీవితానికి ఆటంకం కలగకుండా వ్యాపార లావాదేవీలు చూడగలిగిన భార్య, నమ్మి అందలం ఎక్కించిన ఓటర్లు ఇలా అన్ని ఉన్న వైస్ జగన్ అదృష్టవంతుడా.? దురదృష్టవంతుడా.?

ADVERTISEMENT

దాదాపు పదేళ్ల నిరీక్షణ తరువాత అధికారాన్ని అందిపుచ్చుకున్న జగన్ ఒకరకంగా అదృష్టవంతుడనే చెప్పాలి. రాజకీయాలలో ఎదగడానికి, అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి పదేళ్ల సమయం అంటే చాల చిన్న విషయమేమి కాదు. అయితే ఈ వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని ఉంటే నిజంగా జగన్ అదృష్టవంతుడే అయ్యేవాడు.

ఆయన అదృష్టం ఏపాటిదో కొన్ని ఉదాహారణలతో చూద్దాం…జగన్ రాజకీయ ఎదుగుదల కోసం ఎంతటి కష్టానైనా కాసిన చెల్లి ఇప్పుడు జగన్ కు రాజకీయ భవిష్యత్ ఉండకూడదు అని పంతం పట్టుకుని కూర్చుంది. ఏ బిడ్డ పదవి కోసం తల్లి తాపత్రయ పడిందో ఇప్పుడు అదే బిడ్డ పతనం కోసం ఆ తల్లి ఎదురు చూస్తుంది. ఇది జగన్ అదృష్టమనాలా.? దురదృష్టమనాలా.?

వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానులు అంటూ జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రిగా జగన్, బాబు నిర్ణయించిన రాజధాని అమరావతి లో పాలన చేయలేకపోయారు, తానూ నిర్దేశించిన విశాఖలో ప్రభుత్వాన్ని నడపలేకపోయారు. ఎంతో ఇష్టంతో, వేల కోట్ల ప్రజా ధనంతో రుషికొండ మీద కట్టిన ప్యాలస్ లోకి అప్పుడు ముఖ్యమంత్రిగా అడుగు పెట్టలేకపోయారు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా అడుగు పెట్టలేని పరిస్థితి. ఇదంతా జగన్ తన చేచేతుల చేసుకున్న అదృష్టమా.? దురదృష్టమా.?

చేతిలో అధికారం ఉండి కూడా ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర రాజధానిలో దర్జాగా తిరగలేకపోయారు, పాలన చేయలేకపోయారు. ఇటు అమరావతిలో పరదాల మాటున, భయం గుప్పిట్లో ప్రజలను తప్పిచుకుని తిరిగిన జగన్, అటు విశాఖ రుషికొండకు గ్రీన్ మ్యాట్ తొడిగి, న్యాయస్థానాల కళ్లుకప్పి దొంగ చాటున దొర మాదిరి వ్యవహరించారు.

మూడు రాజధానులు అంటూ ఇటు అమరావతి, అటు విశాఖ, కర్నూల్ ఏ ప్రాంతంలోనూ ప్రభుత్వాన్ని నడపలేని ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు జగన్. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా దేశం దాటాలంటే కోర్ట్ అనుమతి కోసం న్యాయస్థానం మెట్లెక్కాల్సిందే. అలాగే అధికారం పొతే బెయిలు రద్దయి తిరిగి జైలుకెళ్లాలనే భయంతోనే బతుకుతున్న జగన్ లక్కీ నా అన్ లక్కీ నా.?

151 సీట్లతో ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎరుగని విజయాన్ని అందుకున్న అదృష్టవంతుడు జగన్ అనుకునే లోపే ఐదేళ్ల కాలపరిమితిలో అదే ఏపీలో 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష హోదాను కూడా నిలబెట్టుకోలేకపోయిన దురదృష్టవంతుడు గా మిగిలిపోయారు. అయితే అధికారమనే అదృష్టం దక్కితే జగన్ దాన్ని అరాచకాలు, విధ్వంసాలు, అక్రమాలు, అవినీతి అనే బటన్లు నొక్కి దుర్వినియోగం చేసుకున్న జగన్ విపక్షమనే దురదృష్టాన్ని పలుకరించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

BB Telugu: Meluko Rohith Meluko

After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…

28 minutes ago

Jailer 2 Hindi: OTT Destroyed Hrithik Roshan’s Cameo?

Jailer 2 is scheduled to arrive in theatres this week. However, the makers have opted…

59 minutes ago