
రామ్ చరణ్, బాలకృష్ణ, వెంకటేష్ ముగ్గురూ సంక్రాంతికి వస్తున్నారు. అయితే మేము కూడా సంక్రాంతికే వస్తున్నామని టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా ట్వీటేశారు. సంక్రాంతి పండుగ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నామని తెలియజేశారు.
గత ఏడాది ఆగస్ట్ 15 నుంచే ఈ పధకం అమలు చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ దీనిపై మరింత లోతుగా అధ్యయనం చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాతనే అమలు చేయాలని వాయిదా వేసింది. కనుక దీని గురించి విమర్శించేందుకు వైసీపీకి అవకాశం లభించింది. కానీ ఇకపై వైసీపీకి అవకాశం ఉండకపోవచ్చని బోండా ఉమా తాజా ట్వీట్‌తో చెప్పేసిన్నట్లే!
దీనిపై అధ్యయనం చేసేందుకు మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనిత వంగలపూడి, సంధ్యా రాణి ముగ్గురూ రవాణాశాఖ, ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి నేడు బెంగళూరు వెళ్ళి కర్ణాటక మంత్రి రామలింగా రెడ్డితో సమావేశమయ్యి. ఆ రాష్ట్రంలో ఈ పధకం ఏవిదంగా అమలవుతోందో, దానిలో సాధకబాధకాలు ఏమిటో అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఏపీ మంత్రులు ముగ్గురూ అక్కడి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి మహిళల అభిప్రాయాలు కూడా అడిగి తెలుసుకున్నారు.
మంత్రుల కమిటీ అన్ని లాంఛనాలు పూర్తి చేసేసిన్నట్లే ఉంది కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తమ నివేదిక ఇవ్వడమే ఆలస్యం. జనవరి 14 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పధకం ప్రారంభం కావడం ఖాయంగానే కనిపిస్తోంది.
ప్రస్తుతం ఆర్టీసీ బస్సు ప్రయాణికుల్లో 40 శాతం మంది మహిళా ప్రయాణీకుల ద్వారా ఏపీఎస్ ఆర్టీసీకి రోజుకి సుమారు రూ.6-7 కోట్లు, నెలకు సుమారు రూ. 200 కోట్లు ఆదాయం లభిస్తోంది. కనుక ఈ పధకం అమలుచేస్తే ఒకేసారి అంత ఆదాయం కోల్పోతుంది.
ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే రోజుకి అదనంగా కనీసం రెండు మూడు లక్షల మంది కలిపి సుమారు 10 లక్షల మంది మహిళలు వినియోగించుకుంటారని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. కనుక ఆ మేరకు అదనపు భారం కూడా భరించాల్సి ఉంటుంది.
ఈ పధకంతో పెరగబోయే రద్దీని తట్టుకునేందుకు అదనంగా మరో 2,000 కొత్త బస్సులు అవసరమని అధికారులు చెప్పారు. అలాగే వాటి కోసం డ్రైవర్లు, కండెక్టర్లు, మెకానిక్కులు తదితరులు కలిపి మరో 11,500 మంది సిబ్బందిని నియమించుకోవాలసి ఉంటుందని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
కానీ ప్రభుత్వం ఈ ఏర్పాట్లు చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. కనుక వైసీపీ విమర్శలకు భయపడి సంక్రాంతికి ఈ పధకం అమలుచేస్తే ప్రభుత్వం మీద, ఏపీఎస్ ఆర్టీసీ మీద, దాని ఉద్యోగుల మీద కూడా పెద్ద భారమే పడుతుంది. కానీ సంక్రాంతికి వస్తున్నాం అని బోండా ఉమా చెప్పేశారు కనుక వస్తున్నట్లే అనుకోవాలి.
SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…