“గరం”లో తగ్గిన దినుసులు!

Garam movie public talk‘గరం’ సినిమా ప్రమోషన్ కు కొదవ లేకుండా హీరో తండ్రి సాయికుమార్ తన పలుకుబడిని అంతటిని ఉపయోగించుకున్నారనే చెప్పాలి. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు ‘బాహుబలి’ క్రేజ్ ను కూడా వాడుకున్నారు. ‘బాహుబలి’ సినిమాతో హీరో ప్రభాస్, విలన్ గా రానా క్రేజ్ అమాంతంగా పెరిగిపోయాయి. ఈ సినిమా టీజర్ కు ప్రభాస్, ఆడియో ఫంక్షన్ కి రానా ముఖ్య అతిధిగా వచ్చారు. కేవలం ఆడియో ఫంక్షన్ మాత్రమే కాకుండా తెలుగు వార్రియర్స్ క్రికెట్ మాచ్లో కూడా ఈ గరం టీం సందడి చేసింది.

ADVERTISEMENT

ఇలా ప్రమోషన్స్ కోసం పెట్టిన శ్రద్ధ సినిమా స్టోరీ లైన్ మీద పెడితే ఈ స్టార్స్ వెంట పడాల్సిన అవసరం ఉండేది కాదని ‘గరం’ మరోసారి నిరూపించింది. ఈ సినిమా ఆది లో ఉన్న డాన్స్ ప్రతిభను మరోసారి వెండితెరపై చూపించడానికి మాత్రమే ఉపయోగపడిందని సినీ విమర్శకులు తేల్చేసారు. అభినయంలో కూడా కొంతవరకు పరిణితి కనపరిచిన ఆది, స్టోరీల ఎంపిక పై దృష్టి పెట్టాలని హితవు పలుకుతున్నారు.

దర్శకుడు మదన్ కూడా తనకు తెలియని పంథాలో వెళ్ళి కొంతవరకు దెబ్బతిన్నాడనే చెప్పాలి. సినిమాలో చాలామంది కమెడియన్స్ ను పెట్టారు కానీ కామెడీని పండించలేకపోయారు. పాటలు కూడా అంతంత మాత్రమే. సాయికుమార్ తన సొంత నిర్మాణ బ్యానర్ స్థాపించి కొడుకును ఒక మాస్ హీరోగా నిలబెట్టాలనుకుని చేసిన “గరం” ప్రయత్నం విఫల యత్నంగానే మిగిలిందని తేలిపోయింది.

ADVERTISEMENT
Latest Stories