ధోనిని రౌండప్ చేసిన గంభీర్… రివెంజ్ స్టోరీ..!

gautam-gambhir-surrounds-ms-dhoni-ipl-matchటీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి, ఓపెనర్ గౌతమ్ గంభీర్ కు వైరం ఉన్న విషయం బహిరంగ విషయమే. టీమిండియాకు నాయకత్వం వహించిన కెప్టెన్లలో ధోని అత్యుత్తమం కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గంభీర్ ను జాతీయ జట్టుకు దూరం కావడం వెనుక ఉన్నది ధోనియే. దీంతో వీరిద్దరి మధ్య పరోక్ష వైరం కొనసాగుతున్న నేపధ్యంలో శనివారం నాడు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఇద్దరూ ఎదురెదురుగా తలపడ్డారు.

ADVERTISEMENT

బహుశా ధోని బ్యాటింగ్ ప్రతిభను చాటిచెప్పాలనుకున్నాడో ఏమో గానీ, మహేంద్రుడు బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో ధోని బ్యాట్ చుట్టూ ఫీల్డర్లను పెట్టి అంతా అవాక్కయ్యేలా చేసాడు. నిజానికి ఇలాంటి ఫీల్డింగ్ ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్ లలో సైతం పెట్టలేని పరిస్థితి. కానీ, దానిని సుసాధ్యం చేసిన గంభీర్ బౌలింగ్ లో సక్సెస్ అయ్యాడు. ఓ పక్కన వికెట్లు పడిపోతుండడంతో ఆచితూచి ఆడడం గంభీర్ కు కలిసొచ్చింది.

22 బంతులను ఎదుర్కొన్న ధోని కేవలం 8 పరుగులు మాత్రమే చేసాడంటే ఏ రేంజ్ లో గంభీర్ రివెంజ్ తీర్చుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. తాను ఎదుర్కొన్న 22 బంతులలో ఒక్క దాన్ని బౌండరీకి తరలించలేక తన నిస్సహాయతను చాటుకున్నాడు ధోని. ఇటీవల కాలంలో ధోని బ్యాటింగ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ విధంగా రివెంజ్ తీర్చుకున్న గంభీర్, లక్ష్య చేధనలో మాత్రం తొలి బంతికే డకౌట్ గా వెనుతిరిగాడు. అయితే కోల్ కతా మాత్రం పూణేపై విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానాన్ని కబ్జా చేసింది.

ADVERTISEMENT
Latest Stories