“గౌతమిపుత్ర శాతకర్ణి” సంగతులు అదిరిపోయాయి!

Why director krish stood with folded hands next to Balakrishna>నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం “గౌతమిపుత్ర శాతకర్ణి” అన్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఉగాది సందర్భంగా లాంచనంగా ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ జరుపుతున్నట్లు క్రిష్ తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

దక్షిణాది నుండి వచ్చిన ఓ వ్యక్తి భారతదేశం మొత్తాన్ని ఏకం చేసిన విధానం ఎంతో ప్రాశిష్టమైనదని, అలాంటి “గౌతమిపుత్ర శాతకర్ణి” జీవితాన్ని తెరకెక్కించే అవకాశం కలగడం, దానికి బాలకృష్ణ గారు ఒప్పుకోవడం తన అదృష్టమని, ఒకవేళ బాలయ్య ఒప్పుకొని పక్షంలో ఈ కధ కార్యరూపం దాల్చేది కాదని స్పష్టం చేసారు. పక్కా కమర్షియల్ అంశాలతో కధను చెడగొట్టకుండా అయితే సినిమాను తెరకేక్కిస్తానని, ఆ నమ్మకం తనకు ఉందని, దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ అవుతుందని అన్నారు.

ADVERTISEMENT

‘బాహుబలి’ని చూసిన కళ్ళతో ఇలాంటి చారిత్రాత్మక సినిమాలను ప్రేక్షకులు చూడాలంటే ఇది మరింత విజువల్ గా ఉండాలని కోరుకుంటారని, అయితే కధాబలంతో ఉన్న ఈ సినిమా కధ ‘బాహుబలి’తో సరితూగేలా తెరకెక్కిస్తానని క్రిష్ చేసిన వ్యాఖ్యలకు నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతేకాదు, తన సినిమాలలో ఎప్పుడూ ఉండే సామజిక అంశాల ప్రస్తావన ఈ సినిమాలో కూడా ఉంటుందని, ఈ సినిమా విడుదల అయిన తర్వాతైనా కులాల గొడవలు పోతాయని తాను ఆశిస్తున్నట్లుగా క్రిష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

“గౌతమిపుత్ర శాతకర్ణి” కధ ప్రజలకు తెలియకపోవడం ఒక అడ్వాంటేజ్ అని, తెలుసుకోవాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుందని, దేశంలోని అనేక గణరాజ్యాల్ని ఏకతాటిపైకి తీసుకువచ్చి ఏకం చేయడానికి కంకణం కట్టుకున్న గొప్ప ఆలోచనలు, మనసున్న మహా పురుషుడు మన తెలుగు వాడు కావడం విశేషమని, ఇది తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని క్రిష్ చెప్పిన సంగతులు సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలను పెంచుకునేలా చేస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories