“వన్ డే వండర్” కాదు!

Geetha-Govindam-Collectionsట్రేడ్ పండితులను కూడా విస్మయపరుస్తూ “గీత గోవిందం” తొలిరోజు దాదాపుగా 10 కోట్లు కొల్లగొట్టగా, అందులో షేర్ 6 కోట్ల వరకు ఉంది. ఈ కలెక్షన్స్ వరద ‘వన్ డే వండర్’ కాబోవడం లేదు. రెండవ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద అదే దూకుడును ప్రదర్శిస్తోంది. దీంతో సెకండ్ డే ఫిగర్స్ కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ కు తగ్గట్లే ఉండనున్నాయి. మల్టీప్లెక్స్ లలో అడ్వాన్సు బుకింగ్స్ తీరు చూస్తుంటే ఈ వీకెండ్ వరకు పండగ ఖాయమని చెప్పవచ్చు.

[m9ad]

ADVERTISEMENT

సినీ విమర్శకులతో పాటు టాప్ దర్శకుడు రాజమౌళి, అగ్ర హీరో మహేష్ బాబు, అందాల తార సమంత వంటి వారి నుండి కితాబు అందుకోవడంతో, ఖచ్చితంగా ఆ ప్రభావం కూడా ప్రేక్షకులపై పడుతుందని చెప్పవచ్చు. దీంతో మొదటి రోజు మాదిరిగానే, మొదటి వారం ఫిగర్స్ ట్రేడ్ ను షాక్ గురి చేయడం తధ్యంగా కనపడుతోంది. ఈ అనూహ్య విజయంతో మిడ్ రేంజ్ హీరోలలో విజయ్ దేవరకొండ స్థానంపై తెగ చర్చలు జరుగుతున్నాయి.

స్థానిక మార్కెట్ తో పాటు యుఎస్ లో విజయ్ దేవరకొండ సత్తా కొనసాగుతోంది. ఇప్పటికే హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్ దాటిన ఈ సినిమా, టోటల్ రేంజ్ ఏమిటన్నది స్పష్టంగా తెలియాలంటే ఈ వీకెండ్ వరకు వేచిచూడాల్సిందే. విజయ్ ‘అర్జున్ రెడ్డి’ సినిమా 2 మిలియన్ మార్క్ లో ఉండగా, ఈ ‘గీత గోవిందం’ ఆ మార్క్ ను చేరుకుంటుందా? లేక 3 మిలియన్ సంఖ్యకు చేరువై మళ్ళీ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories