బ్యాక్ టు ‘అర్జున్ రెడ్డి’ స్టైల్!

Geetha -Govindam frustrated songతాను చాలా డీసెంట్ గా మారిపోయాను అంటూ ఇటీవల “గీత గోవిందం” టీజర్ తో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ, మళ్ళీ ‘అర్జున్ రెడ్డి’ స్టైల్ లోకి మారిపోయారు. ‘గీత గోవిందం’లోని రెండవ పాటను గురువారం ఉదయం 11.55 నిముషాలకు విడుదల చేస్తున్నట్లుగా తనదైన స్టైల్ లో ప్రకటించాడు విజయ్.

అంతేకాదు ఆ పాట కూడా ‘అర్జున్ రెడ్డి’ మోడల్ లోనే ఉండడం విశేషం. ‘వాట్ ది ఫ’ అంటూ ప్రారంభమయ్యే ఈ పాటను ఒక ఫ్రస్ట్రేటేడ్ సింగర్ ఆలపించినట్లుగా పోస్టర్ ను రిలీజ్ చేసారు. బహుశా విజయ్ దేవరకొండనే ఈ పాటను పాడారేమో అనిపించేలా ఈ పోస్టర్ ఉంది. ఆగష్టు 15న విడుదల కాబోతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories