ఆ హీరో రాక కోసం జీహెచ్ఎంసీ అధికారులు ఎదురుచూపులు!

ghmc officers waiting for salman khanనేడు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కోసం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు వేచిచూసారు. అయినప్పటికీ సల్మాన్ రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహపడ్డారు. హైదరాబాద్ ఎన్నికలకు సల్మాన్ ఖాన్ కు లింకేంటి అని ఆలోచించకండి… అందుకోసమే మన అధికారులు సల్మాన్ పేరిట ఒక ఓటర్ కార్డును కూడా ముద్రించారు. బహుశా ఈ సమాచారం సల్మాన్ ఖాన్ కు అందించి ఉండరు. లేదంటే సల్మాన్ ను వారి ముచ్చట కూడా తీరేదేమో!

ప్రభుత్వ అధికారుల పని తీరుకు అద్దం పట్టే ఘటన ఇది. ‘మన దేశంలో ఏదైనా జరగవచ్చు’ అని అందరూ ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారంటే అధికారుల నిర్వాకం ఏ మేరకు ఉందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే మన ప్రభుత్వాల మీద, చట్టాల మీద ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు. నిజానికి ఈ రోజు హైదరాబాద్ లో వెలుగు చూసిన సల్మాన్ ఖాన్ ఓటర్ కార్డు తెలుగు రాష్ట్రాలకు కొత్తేమీ కాదు. గతంలో సచిన్ టెండూల్కర్ కు కూడా మన వాళ్ళు ఓటర్ కార్డులను మంజూరు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే గతం నుండి పాఠాలు నేర్చుకుంటారని ఎవరైనా భావిస్తే… అది మాత్రం పొరపాటే అని అధికారులు రుజువు చేస్తున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories