ఏనాటి సినిమా ఈ “ఆరడుగుల బుల్లెట్?”

Gopi chand - Aradugulla Bullettu First lookసంగీత దర్శకుడు మణిశర్మ వరుసగా అగ్ర హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూ పీక్ స్టేజ్ లో ఉన్న రోజులలో మొదలైన సినిమా… ప్రస్తుతం మణిశర్మ శిష్యుడు థమన్ కూడా అవుట్ డేటెడ్ అయిపోయిన రోజులు..! నాడు మొదలైన సినిమా నేడు టైటిల్ ను ఖరారు చేసుకుని ‘ఫస్ట్ లుక్’ను విడుదల చేసుకుంది. అవును… గోపీచంద్ హీరోగా, నయనతార హీరోయిన్ గా సుప్రసిద్ధ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో అప్పుడెప్పుడో ప్రారంభమైన సినిమా గురించే ఇదంతా!

నిజానికి ఈ సినిమా విడుదల కాదనే నిర్ణయానికి అంతా వచ్చేసిన తరుణంలో సడెన్ గా “ఆరడుగుల బుల్లెట్” అంటూ ప్రత్యక్షమయ్యాడు గోపీచంద్. ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్ధమవుతోంది… ఇది ఏ కాలం నాటి సినిమానో అని..! నాణ్యత లేని ఈ పోస్టర్ లో పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని ‘ఆరడుగుల బుల్లెట్’ టైటిల్ తప్ప ఏమీ ఆకర్షించడం లేదు. కనపడుతున్న గోపీచంద్ కటౌట్ కూడా పాతకాలం నాటి సినిమాలను గుర్తుకు తెస్తోంది తప్ప, పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.

ADVERTISEMENT

అయితే ఈ చిత్రానికి ఎంపికైన తారాగణం మొత్తం స్టార్ కాస్టింగ్ కావడం… ఎంతో కొంత సినిమా బిజినెస్ కావడానికి తోడ్పాటునిస్తోంది. వక్కంతం వంశీ, అబ్బూరి రవి, మణిశర్మ, నయనతార తదితరుల పేర్లు సిల్వర్ స్క్రీన్ నిండుతనాన్ని తీసుకువస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా కానుండడం గోపీచంద్ అభిమానులకు ఊరట కలిగించే విషయం. ‘స్పైడర్’ విడుదల వాయిదాతో మేలో సిద్ధమైన సినిమాల జాబితాలో ఈ “ఆరడుగుల బుల్లెట్” కూడా చేరిందని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories