
ప్రభుత్వ ఆస్తిని కుటుంబ ఆస్తిగా మార్చుకుని దాని మీద వాటాల కోసం కోర్టుకెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైస్ జగన్ ఆయన సోదరి వైస్ షర్మిలకు కూటమి ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది.
ఈ మధ్య కాలంలో వైస్ కుటుంబంలో మొదలైన ఆస్తి పంపకాలు వివాదంలో భాగంగా తెరమీదకు వచ్చిన సరస్వతి పవర్ ఇండస్ట్రీకి సంబంధించిన భూముల పంచాయితీ మీద జరిగిన రచ్చ ఏపీ వ్యాప్తంగా చరికాహ్కు వచ్చింది.
అయితే ఈ భూముల మీద హక్కు తమదంటే తమదంటూ వైస్ జగన్, షర్మిల కోర్ట్ కెళ్ళడం, మధ్యలో వచ్చిన విజయమ్మ ఆ భూముల మీద పూర్తి హక్కు తన కూతురు షర్మిలకే దక్కుతుంది అంటూ ప్రకటించడం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపింది.
అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి వైస్ కుటుంబం చేతిలో ఉన్న ఈ భూముల పై సమగ్ర సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించగా, సర్వే నిర్వహించిన అధికారులు వీటిని ప్రభుత్వ అసైన్డ్ భూములుగా గుర్తించారు.
దీనితో సరస్వతి పవర్ ఇండస్ట్రీకి కేటాయించిన సుమారు 17.69 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇందుకు గాను పల్నాడు జిల్లా మాచవరంకు చెందిన తహశీల్దార్ ఎం.క్షమారాణి ఉతర్వులు జారీ చేసారు. వేమవరం లో 13.80 ఎకరాలు, పిన్నెళ్లి గ్రామాల పరిధిలో ఉన్న 3.89 ఎకరాలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు.
అయితే ఇన్నాళ్లుగా ప్రభుత్వ ఆస్తిగా ఉన్న ఈ భూములను తమ తండ్రి వారసత్వపు ఆస్తిగా చెప్పుకుంటూ తిరిగి దాని మీద హక్కు కోసం అన్నా చెల్లెళ్ళిద్దరు కోర్ట్ కెళ్ళడం, దానికి తల్లి విజయలక్ష్మి వచ్చి ఈ భూముల మీద హక్కు షర్మిలకే ఉందంటూ పెద్దరిక పంచాయితీ చేయడం అంతా కూడా వైస్ కుటుంబం ఆడే జగన్నాటకంలో భాగమే అనేది సుస్పష్టమయ్యింది.
అసలు వైస్ కుటుంబ ఆస్తుల చిట్టా పొద్దు ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే వారిని నుండి ప్రభుత్వం ఇంకెన్ని ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందో, మరెంత ప్రజల ఆస్తిని ప్రోజెక్టుల పేరుతో వైస్ కుటుంబం కబ్జా చేసిందో ప్రజలు ముందు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులు ముందుకు వేయగలిగితే ఇక ఏపీలో వైసీపీ కి సమాధి కట్టినట్టే అవుతుంది.
SS Rajamouli has conquered box-office records with larger-than-life storytelling. But there is one thing that…
Following the terrible failure of Toxic, Yash has still not announced his next solo lead…