ఉద్యోగులను అమరావతికి రప్పించడానికి వారు కోరిన ప్రతి అంశాన్ని నేరవేరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, హైదరాబాద్ టు విజయవాడ ఉద్యోగులు డైలీ సర్వీస్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం… బహుశా మరొకరికి సాధ్యం అవునో, కాకపోవచ్చో అనే అంచనాలు వేయడానికి కూడా అవకాశం ఇవ్వలేని విధంగా తరలింపుపై చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు.
కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో సంప్రదింపులు జరిపి, అమరావతి ఉద్యోగుల కోసం ఓ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసిన చంద్రబాబు సర్కార్, ఈ రైలు సమయాలు వారు డైలీ సర్వీస్ చేసే విధంగా ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. రైలు నెంబర్ 12795 పేరిట విజయవాడ నుంచి సికింద్రాబాద్ కు రోజూ సాయంత్రం 5:30 గంటలకు విజయవాడలో బయలుదేరి 6:20కి గుంటూరు చేరి, అక్కడి నుంచి నాన్ స్టాప్ గా రాత్రి 11:10కి సికింద్రాబాద్ చేరుతుంది.
అలాగే మరో వైపు నుండి ఇదే రైలు సికింద్రాబాద్ నుంచి ఉదయం 5:30కి బయలుదేరి గుంటూరుకు 10:08కి, ఆపై 11 గంటలకు విజయవాడకు చేరుతుంది. దీంతో రోజు విడిచి రోజు విజయవాడ, సికింద్రాబాద్ ల నుండి బయలుదేరనుంది. మొత్తం 14 బోగీల్లో 10 సీటింగ్, రెండు ఏసీ చైర్ కార్, రెండు ఎస్ఎల్ఆర్ కోచ్ లు ఉంటాయని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత త్వరగా ప్రయాణం చేయడం సాధారణ బస్సులకు కూడా సాధ్యం కాదు. అంటే కార్లు మరియు గరుడ బస్సులతో పాటు అమరావతి రైలును పరుగులు పెట్టిస్తోంది ఏపీ సర్కార్.





