“వస్తున్నాం కొడుతున్నాం” అనేది నాగార్జున మార్క్ డైలాగ్. ఒక సినిమా మీద విపరీతమైన నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నాగార్జున ఈ డైలాగ్ ను స్టేజ్ మీద వాడతారు. ఇది ఒక సినిమాకి నాగార్జున మార్క్ రివ్యూ మరియు స్టాంప్ అనుకోవాలి. నాగార్జున ఇదివరకు “సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు, తండేల్” సినిమాల రిజల్ట్స్ టైంలో ఈ డైలాగ్ వేశారు. ఆ సినిమాలు అక్కినేని హీరోల కెరీర్లో ఎంత పెద్ద హిట్లుగా నిలిచాయి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మళ్లీ నాగార్జున నిన్న అఖిల్ తాజా చిత్రం “లెనిన్” విషయంలోనూ అదే మాట అన్నారు. దాంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఎందుకంటే.. అఖిల్ లాంచ్ అయ్యినప్పటినుండి అతడ్ని ఒక సక్సెస్ ఫుల్ స్టార్ హీరోగా చూడాలి అనేది అక్కినేని అభిమానులు మరియు సగటు సినిమా అభిమానుల ఆశ. చూడ్డానికి బాగుంటాడు, డ్యాన్స్ & ఫైట్స్ బాగా చేస్తాడు. యాక్టింగ్ కూడా పర్లేదు. అయినా.. సరైన హిట్ పడక హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు నేటి వరకు. అందుకే “లెనిన్” మీద చాలా అంచనాలు ఉన్నాయి.
ముఖ్యంగా నాగవంశీ ఈ సినిమాలో భాగస్వామి కావడం, ప్రమోషన్స్ విషయంలో లెనిన్ టీమ్ తెగ హల్ చల్ చేస్తుండడంతో జనాల్లోకి “లెనిన్” బాగా వెళ్లిపోయింది. ఇక కంటెంట్ బట్టి రిజల్ట్ ఉంటుంది. అయితే.. నిన్న తిరుపతిలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా అఖిల్ మాట్లాడుతూ..”నేను ఏం అరవను, మీ ఇంటోడిలా వచ్చాను, నన్ను ఇంటికి తీసుకెళ్లండి.. హ్యాపీగా ఉంటా” అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ బాగా వర్కవుట్ అయ్యింది. జనాలకి ఓన్ చేసుకునే చాయిస్ ఇచ్చాడు అఖిల్.
మరి అక్కినేని సెంటిమెంట్ చక్కగా రిపీట్ అయ్యి.. అఖిల్ హీరోగా సెటిల్ అవుతాడా? లేక రీరీరీ లాంచ్ ల ప్రహసనం కొనసాగిస్తాడా? అనేది మరో మూడు రోజుల్లో తెలిసిపోతుంది.
Nagarjuna Repeats His Sentiment
“వస్తున్నాము… కొడుతున్నాము!”#NaaSaamiRanga, #Thandel తర్వాత…
ఇప్పుడు #LENIN
ఈ ప్రేక్షక దేవుళ్లకి చెబుతున్నా…జూలై 10న మనవాడు వస్తున్నాడు… కొడుతున్నాడు! pic.twitter.com/h6OR3Z0LKo
— M9 NEWS (@M9News_) July 5, 2026




