మెగా కాంపౌండ్ లోకి జెర్సీ దర్శకుడు

gowtham tinnanuri next with ram charanతన మొదటి సినిమా మళ్ళీ రావా మంచి మార్కులు కొట్టేశాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఆ తరువాతి సినిమా నాని నటించిన జెర్సీతో శెభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరో గా జెర్సీ రీమేక్ చేస్తున్నారు. ఇప్పుడు తన తరువాతి ప్రాజెక్టు తో మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అవుతున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

గతంలో సీనియర్ నిర్మాత ఎన్వీ ప్రసాద్ జెర్సీ కంటే ముందే గౌతమ్ కు అడ్వాన్స్ ఇచ్చారట. ఇటీవలే తన వద్ద రామ్ చరణ్ ను సరిపోయే మంచి కథ ఉందని గౌతమ్ ఎన్వీ ప్రసాద్ కు తెలిపారట. తొందరలోనే గౌతమ్ రామ్ చరణ్ ని కలిసి కథ వినిపిస్తాడని సమాచారం. జెర్సీ హిందీ రీమేక్ ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ చెయ్యబోయే తరువాతి ప్రాజెక్టు ఇదే. ఆర్ఆర్ఆర్ జులై 30న విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది అంటున్నారు. ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ కు వాయిదా పడినట్టు సమాచారం.

కొందరు ఏకంగా వచ్చే ఏడాది సంక్రాంతి కి వస్తుందని కూడా అంటున్నారు. ఏ రకంగా చుసిన హిందీ జెర్సీ విడుదల నాటికి రామ్ చరణ్ ఫ్రీ అవుతాడు. గౌతమ్ సినిమా అంటే రామ్ చరణ్ కు ఖచ్చితంగా ఒక డిఫరెంట్ సినిమా అవుతుందనే అనుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories