
అవును… అహ్మదాబాద్ లో జైడస్ హాస్పిటల్ లో జరుగుతున్న మహేష్ సినిమా షూటింగ్ స్పాట్ కు గుజరాత్ డిప్యూటీ సిఎం నితిన్ భాయ్ పటేల్ విచ్చేసారు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఓ పక్కన మురుగదాస్, మరో పక్కన మహేష్ ను పెట్టుకుని దిగిన ఈ ఫోటోలో ఉన్న అందరి కంటే ఎత్తుగా కనపడుతున్న ప్రిన్స్ రేంజ్ కూడా ఆ స్థాయిలోనే ఉన్నట్లు అర్ధమవుతోంది.
ఇక, ఈ సినిమా టైటిల్ విషయమై నిర్మాత ఠాగూర్ మధు స్పందిస్తూ… తాము అనుకుంటున్న నాలుగు టైటిల్స్ లో ‘సంభవామి’ కూడా ఒకటని, అంతేగానీ, ఇప్పటివరకు ఏ టైటిల్ ను ఖరారు చేయలేదని, జనవరిలో టైటిల్ పై స్పష్టత వస్తుందని అన్నారు. మురుగదాస్ తెరకెక్కించిన ‘తుపాకీ’ తరహాలోనే ఈ సినిమా నేపధ్యం కూడా ఉంటుందని ప్రిన్స్ అభిమానులకు ఓ ‘క్లూ’ ఇచ్చారు.
రాజకీయాలలో ఎల్లప్పుడూ శత్రుత్వమే కాదు మర్యాదలు, సత్ సాంప్రదాయాలు, ఆనవాయితీలు కూడా పాటించడం అవసరం. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి,…
Social media was buzzing recently with news that Ranveer Singh bought the rights to Amish…