ఓటిటీలలో సందడి చేయనున్న సంక్రాంతి సినిమాలు…!

Guntur Kaaram Naa Saami Ranga

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్, గుంటూరు కారం, సైన్ధవాః, నా సామిరంగా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని ఫలితాలను సాధించాయి. గుంటూరు కారం మూవీతో మహేష్ మరో మాస్ బ్లాక్ బాస్టర్ కు రెడీ అయ్యారు అనుకుంటే అది సాధారణ ప్రేక్షకులను అలరించలేక మిక్స్డ్ టాక్ తో సరిపెట్టుకుంది.

అలాగే ఫ్యామిలీ మాన్ గా గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ యాక్షన్ మాన్ గా మారడంతో సైన్ధవాః మూవీ ని సైడ్ చేసారు ప్రేక్షకులు. ఇక ఎటువంటి అంచనాలు లేకుండా కేవలం సంక్రాంతి సెంటిమెంట్ ను నమ్ముకుని థియేటర్లలోకి వచ్చిన నాగార్జున నా సామి రంగ సెంటిమెంట్ ను నిలబెట్టుకుంది. అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గరగా కూడా నిలబడింది.

ADVERTISEMENT

చిన్న సినిమా, మీకెందుకు, సైడ్ ఇవ్వవచ్చుగా, సైడ్ అవ్వచ్చుగా అంటూ సలహాలిచ్చిన ప్రతి వాడికి తన హను MAN తో హనుమంతుడి పవర్ చూపించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఎవ్వరి ఊహలకు అందనంత విజయాన్ని ఈ చిత్రం సాధించింది. ఎన్నో రికార్డులను బద్దలు కొడుతూ కొత్త రికార్డులను సృష్టించి ఈ హనుమాన్.

అయితే వీటిలో వెంకటేష్ నటించిన సైన్ధవాః మూవీ ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి ఫ్లాట్ ఫామ్ కు చేరింది. అయితే తాజాగా మహేష్ గుంటూరు కారం, నాగార్జున నా సామి రంగ మూవీలు కూడా ఓటిటి రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఈ అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ లో గుంటూరు కారం స్ట్రీమ్ అవుతుంది. అలాగే ఈ నెల 15 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో నాసామి రంగ సందడి మొదలవుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే విడుదల తేదీ మీద ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories