
టీవీలో చూస్తున్న ఆడియెన్స్ ఇంక చాలు ఆపండ్రా అంటూ ఛానల్ మార్చేస్తుంటే, యూట్యూబ్ లో చూసే యూతేమో ఈ టెంప్లేట్ యాంకరింగ్ మా వల్ల కాదంటూ మన హీరో మైక్ పట్టుకున్నప్పుడు ఆ బిట్ చూస్తే చాల్లే అని ఫిక్స్ అయిపోయారు.
దానికి తోడు డైలీ యూట్యూబ్ లో లోడ్ అవుతున్న సెలెబ్రిటీ ఇంటర్వూస్ కూడా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కి ఒక్కప్పుడు ఉండే ప్రీమియం వేల్యూ ని కిల్ చేసేశాయి.
కానీ ఇది ఇంకా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కి మాత్రం అర్ధం కాలేదు అందుకే ఇంకా ప్రీ-రిలీజ్ ఈవెంట్ అదీ అంటూ వాళ్ళ లోకం లో వాళ్ళు లక్షల్లో ఖర్చు పెడ్తూ వేరే లోకంలో ఉంటున్నారు.
మారుతున్న ట్రెండ్స్, ఆడియెన్స్ చేంజ్ ఆఫ్ మూడ్ ని అర్ధం చేస్కోవడం చాలా ముఖ్యం.
ఈ మధ్య వచ్చిన సినిమాలనే చూస్తే, జైలర్, లియో, సలార్ సినిమాలేవీ ‘ఈవెంట్’ మీద ఆశలు పెట్టుకోలా, ఇంకా చెప్పాలంటే టీజర్, ట్రైలర్ తో సరిపెట్టాశారు ఆ హీరోలు.
కానీ ఆడియెన్స్ మాత్రం ఫిక్స్ అయిపోయారు చూసేయాలని. అదే స్టార్ హీరో ప్లస్ స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ కి ఉండే వేల్యూ.
సలార్ ని ప్రభాస్, ప్రశాంత్ నీల్ హిందీ లో ప్రమోట్ చేసుంటే ఇంకా బాగా ఓపెనింగ్ వచ్చేదేమో అనచ్చు. కానీ ఒక ట్రైలర్ హిందీ లో వదిల్తేనే 15 కోట్ల ఓపెనింగ్ వచ్చింది అదీ షారుఖ్ ఖాన్ తో క్లాష్ తో. ప్రభాస్ లాంటి హీరో వచ్చీ రాని హిందీతో ప్రమోట్ చేయడం వల్ల 15 కోట్ల ఓపెనింగ్ 20 అవదుగా!
ఒక్క ముక్క లో చెప్పాలంటే, ఆడియెన్స్ మారిపోయారు ఈ రొట్ట రొటీన్ ఈవెంట్స్ మాకు అక్కర్లేదు, స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ సినిమా ఉంటే మేం ఫిక్స్ మీ సినిమా చూడ్డానికి అని, ఇది నెక్స్ట్ రాబోతున్న గుంటూరు కారంకి కూడా అప్లై అవుద్ది.
మహేష్-త్రివిక్రమ్ ఒక్క ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఒక టికెట్ కూడా తక్కువ తెగదు. కాదు కూడదు మా లక్షలు మేము కరిగించుకోవాలి ప్రీ -రిలీజ్ ఈవెంట్ తో అంటే అది తప్పేం కాదు.
The opposition’s march to the Supreme Court over voter-list revision has put the BJP in…
After the wild-card contestants enter, the basic expectation is that the existing contestants take the…