
Gyanesh Kumar Resignation Sparks Debate!
కాంగ్రెస్ పార్టీ, సీజేపీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. కనుక వాటి మద్య సన్నటి రేఖ ఇప్పుడు పూర్తిగా తొలగిపోయింది. కనుక వాటి పోరాటం ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజల ఓటు హక్కుని కాపాడటం కోసమా లేక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయడం కోసమా? అనే సందేహం కలుగుతుంది.
ఇంతకు ముందు అవి పట్టుబట్టి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేత రాజీనామా చేయించ గలిగాయి. అది వాటి విజయానికి ప్రతీకగా, తాజా ఆందోళనలకు స్పూర్తిగా ఉపయోగపడిందే తప్ప అయన రాజీనామాతో ఎటువంటి ‘గుణాత్మక మార్పు’ ఏర్పడలేదు.
కనుక ఇప్పుడూ అవి సీఈసీ జ్ఞానేశ్ కుమార్ చేత రాజీనామా చేయించడం ద్వారా అవి ఏం సాధించాలనుకుంటున్నాయి? అంటే ‘ఎస్ఐర్’ పేరుతో అక్రమంగా ఓట్లు తొలగించినట్లు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లవుతుంది. అయన చేత రాజీనామా చేయించగలిగితే మరో విజయం వాటి ఖాతాలో జమ అవుతుంది. అది వాటి లక్ష్యం దిశగా పడిన మరో బలమైన అడుగు అవుతుంది.
కనుకనే కాంగ్రెస్, సీజేపీ వ్యూహాత్మకంగా ఈ రెండో యుద్ధం మొదలుపెట్టాయి. కానీ వాటి పోరాటంలో నిజాయితీ ఉండి ఉంటే ముందుగా తొలగించిన అర్హులైన ఓటర్లను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించాలి కదా? కానీ తమ లక్ష్య సాధనకు జ్ఞానేశ్ రాజీనామాకు పట్టుబడుతున్నాయి. అయితే ఆయన రాజీనామాతో వాటి యుద్ధం ఆగేది కాదు. అది మరో కొత్త యుద్ధానికి ప్రారంభంగా మారుతుంది.
ఇవన్నీ ప్రధాని మోడీ, అమిత్ షాలకు తెలియనివి కావు. అందుకే కేంద్ర మంత్రి చేత రాజీనామా చేయించడానికి పెద్దగా వెనుకాడని కేంద్ర ప్రభుత్వం జ్ఞానేశ్ విషయంలో తొందరపడటం లేదనుకోవచ్చు. కానీ ఇలా ప్రతీ రెండు నెలలకు ఓసారి దేశంలో ఆందోళనలు సృష్టిస్తూ, దేశ రాజధాని ఢిల్లీని ముట్టడిస్తుంటే, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ట మసకబారుతోంది. వీటి కారణంగా భారత్‌లో అధికార మార్పిడి జరిగే అవకాశం ఉందని భావిస్తే విదేశీ కంపెనీలు, పెట్టుబడులు నిలిచిపోయే ప్రమాదం పొంచి ఉంది.
కనుక దేశ ప్రయోజనాల కంటే మా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునేవారిని ప్రజలు కూడా గుర్తించి దూరం పెట్టాలి. వారి వాదనలు విని గుడ్డిగా నమ్మి ఆందోళనలలో పాలుపంచుకొని దేశమంతట వ్యాపింపజేస్తే ఆ తర్వాత చింతించి ప్రయోజనం ఉండదు.
Ravi Teja joins filmmaker Vivek Athreya, who is known for his distinct storytelling style, for…
సౌదీఅరేబియా అంటే చమురు నిక్షేపాలు కలిగిన ధనిక దేశం. ప్రపంచ చమురు అవసరాలను తీర్చుతున్న దేశం. లక్షలాది మంది భారతీయులతో…