అమెరికాతో గల్ఫ్ దేశాల చెలిమి పులి మీద సవారీయే!

సౌదీఅరేబియా అంటే చమురు నిక్షేపాలు కలిగిన ధనిక దేశం. ప్రపంచ చమురు అవసరాలను తీర్చుతున్న దేశం. లక్షలాది మంది భారతీయులతో సహా అనేక దేశాల కార్మికులు, ఇంజనీర్లు, వైద్యులు, నర్సులు, వివిద రంగాల నిపుణులకు ఉద్యోగాలు కల్పిస్తున్న దేశం. తద్వారా వారి పేదరికం, మధ్యతరగతి సమస్యల నుంచి వారి కుటుంబాలను బయటపడేసింది.

ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మతస్తులకు పరమ పవిత్రమైన ‘మక్కా’ వంటి పుణ్యక్షేత్రం కలిగిన దేశం. నేటికీ మద్యం, మాదక ద్రవ్యాలు, వ్యభిచారం, దొంగతనాలు, హత్యలు వంటి అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేస్తున్న దేశం.

ADVERTISEMENT

సౌదీఅరేబియాకు మొదటి నుంచి యెమెన్‌తో చిరకాల శత్రుత్వం ఉంది. కాలక్రమంలో అది హౌతీలతో యుద్ధంగా మారింది.

ఇటీవల ‘మక్కా’పై కూడా డ్రోన్ దాడులు చేయబోతే సౌదీ వాయుసేన వాటిని గాలిలోనే పేల్చివేసి మక్కాను కాపాడుకుంది.

తాజాగా రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు క్షిపణి దాడి చేశారు. ఈ దాడిలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 309 మంది గాయపడ్డారు. సౌదీ చేస్తున్న దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు చెపుతున్నారు.

ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తున్న సౌదీఅరేబియాలో మళ్ళీ ఇటువంటి యుద్ధ వాతావరణం ఎందుకు ఏర్పడింది?అని ప్రశ్నిస్తే చిరకాల శత్రుత్వం అని చెప్పవచ్చు.

కానీ ఇరాన్‌ మీద అమెరికా యుద్ధం ప్రకటించిన తర్వాత నుంచే మళ్ళీ ఈ దాడులు మొదలయ్యాయని చెప్పక తప్పదు.

సౌదీఅరేబియాతో పలు గల్ఫ్ దేశాలు తమ భూభాగంలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతించినందున, వాటిని ఇరాన్‌ శత్రుదేశాలుగా పరిగణించి దాడులు చేస్తోంది.

అయితే యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దళాలకు ఇరాన్‌కు మద్య బలమైన సంబంధాలున్నాయి. వారికి అవసరమైన ఆయుధాలు ఇరాన్‌ అందిస్తుంటుంది. కనుక ఇప్పుడు వారికి ఇరాన్‌కు సంఘీభావం తెలిపేందుకు తమ ఉమ్మడి శత్రు దేశమైన సౌదీఅరేబియా వరుసగా దాడులు చేస్తున్నారు.

ఒకవేళ అమెరికా-ఇరాన్‌తో యుద్ధం మొదలుపెట్టకపోయి ఉంటే, నేడు సౌదీతో సహా గల్ఫ్ దేశాలలో ఇటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడి ఉండేదే కాదు. ముఖ్యంగా సౌదీపై హౌతీలు ఈ స్థాయిలో దాడులు చేసి ఉండకపోవచ్చు.

అంటే సౌదీఅరేబియాతో సహా పలు గల్ఫ్ దేశాలు అమెరికాతో చెలిమికి భారీ మూల్యం చేల్లిస్తున్నాయన్న మాట! అమెరికా ప్రయోజనాల కోసం ఇరాన్‌తో యుద్ధం మొదలుపెడితే, ప్రశాంతత, అభివృద్ధికి మారుపేరుగా ఉన్న గల్ఫ్ దేశాలకు ఈ యుద్ధ జ్వాలలు వ్యాప్తిచెందడం చాలా బాధాకరమే.

ముఖ్యంగా గల్ఫ్ దేశాలు తమది కానీ ఈ యుద్ధంలో చిక్కుకోవడం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై పెను ప్రభావం చూపడం ఖాయం. ఈ యుద్ధజ్వాలలను రాజేసిన అమెరికా ఏదో ఓ రోజు పక్కకు తప్పుకోవచ్చు. కానీ అది రగిల్చిన ఈ మంటలు ఎప్పటికైనా ఆరుతాయా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

RT’s Thulabharam Title Documentary: A Creative Approach

Ravi Teja joins filmmaker Vivek Athreya, who is known for his distinct storytelling style, for…

29 minutes ago

జ్ఞానేశ్ రాజీనామాకు ఎందుకింత ఆరాటం?

కాంగ్రెస్‌ పార్టీ, సీజేపీ కలిసి కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాయి. కనుక వాటి మద్య సన్నటి రేఖ ఇప్పుడు పూర్తిగా…

1 hour ago