అక్కడ ‘PSPK’…ఇక్కడ ‘D.CM’…!

తెలుగు సినీ వినీలాకాశంలో ‘మెగాస్టార్’గా కీర్తిని ఆర్జించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ చిరంజీవి సాధించని రికార్డులు, ప్రదర్శించని అభినయం లేదు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన కమర్షియల్ హీరోగా చిరంజీవి అనే పేరు సువర్ణాక్షరాలతో ఎల్లప్పుడూ లిఖించబడి ఉంటుంది.

ADVERTISEMENT

అలాంటి చిరంజీవి వారసత్వంతో సిల్వర్ స్క్రీన్ పైకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ వెండితెర జీవితం ‘నల్లేరు మీద నడక’ అయితే కాదు. తొలి సినిమాతోనే చేతుల మీదకి కార్లు ఎక్కించుకోవడం, ఛాతి మీద రాళ్లను పెట్టి బద్దలు కొట్టించుకోవడం వంటి విన్యాసాలతో తనకంటూ ప్రత్యేకమైన ముద్రను చాటుకున్నాడు.

అలా మొదలైన ప్రస్థానంలో “తొలిప్రేమ, బద్రి, ఖుషి” సినిమాలు ఒక్క పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ నే కాదు, ఏకంగా తెలుగు సినీ దశాదిశలను కూడా మార్చివేసింది. “ఖుషి” సినిమా తర్వాత అభిమానగణంలో తన ‘అన్న’ చిరంజీవి స్టార్ డంను కూడా మించిపోయే స్థాయిలో ‘తమ్ముడు’ మాస్ క్రేజ్ యూత్ ని పిచ్చెక్కించింది.

ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవే ఈర్ష్యకు గురయ్యేలా పవన్ ప్రభంజనం మొదలయ్యింది. అయితే ఆ క్రమంలోనే కెరీర్ పరంగా తప్పటడుగులు పడడమే కాకుండా, “ప్రజారాజ్యం” అనే ‘అన్న’ రాజకీయ ప్రస్థానాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ప్రజాసేవకు శ్రీకారం చుట్టారు.

వెండితెర మీద ‘మెగాస్టార్’ రేంజ్ ఏమిటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి మెగాస్టార్ రాజకీయ రణగంగంలో మాత్రం విమర్శల పాలయ్యారు. తనకున్న ‘స్టార్’ ఇమేజ్ కు ప్రజలు ముఖ్యమంత్రి ‘పీఠం’తో పట్టం కడతారని మెగాస్టార్ భావిస్తే, చివరకు తన పార్టీని మరొక జాతీయ పార్టీలో విలీనం చేసి ‘చేతులు’ దులుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

‘అన్న’ మెగాస్టార్ ఎక్కడ అయితే ఓటమి చవిచూసారో, అదే రాజకీయాన్ని ‘తమ్ముడు’ జనసేన ద్వారా ప్రారంభించి మరో సంచలనానికి తెరలేపారు. కనీవినీ ఎరుగని స్థాయిలో ఉన్న యూత్ క్రేజ్ తో ప్రారంభమైన ‘జనసేన’ ప్రయాణం కూడా ప్రజాతీర్పు ముంగిట విమర్శల పాలయ్యింది. ఎంతలా అంటే, నమ్ముకున్న అభిమానగణమే నట్టేట ముంచేంతలా!

అయితే ఇక్కడ ‘తమ్ముడు’ విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంది. ‘పదవులు’ ముఖ్యం కాదు, తాను సాగిస్తున్న ‘ప్రయాణమే’ ముందు అన్నట్లుగా, ‘ప్రజా శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధే’ లక్ష్యంగా ‘నిస్వార్థమైన’ రాజకీయాలకు తెరలేపి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు.

ఎక్కడైతే ‘అన్న’ నెగ్గలేకపోయారో, అదే రాజకీయాన్ని ‘తమ్ముడు’ దాసోహం చేసుకుని, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 100 శాతం ఉత్తీర్ణత సాధించి, భారతదేశ రాజకీయ ముఖచిత్రమంతా ‘జనసేన’ వైపు చూసేలా చేసాడు. వెండితెర అభినయ ప్రదర్శనలో ‘అన్న’ మెగాస్టార్ ఎప్పుడూ పై మెట్టులో ఉంటారు గానీ, ప్రజాసేవలో మాత్రం ‘తమ్ముడు’ పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ ‘అన్న’ని మించిన వాడే!

అందుకేనేమో… జనసేన గెలుపు తర్వాత ‘అన్న’ ఆశీర్వాదం కోసం వెళ్లి ‘తమ్ముడు’ కాళ్ళ మీద పడబోతుంటే, స్వయంగా పైకి లేపి గుండెలకు హత్తుకున్నారు మెగాస్టార్. సినీ రంగంలో ప్రేక్షకులను రంజింప చేయడానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకపోతే, చాలామంది హీరోలు ఉన్నారు, ఇంకా పుట్టుకొస్తారు కూడా!

కానీ 2019-24 కాలంలో వైసీపీ రాజకీయ విధానాలు చూసిన తర్వాత, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరంగా మారింది. జగన్ సంక్షోభంతో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి మూడు పార్టీల పొత్తుతో ఒక కొత్త ఆశను చిగురింపచేసిన నాయకులలో పవన్ కళ్యాణ్ పేరు మొదటిదే!

అవకాశం కోసం అడ్డదారులు తొక్కలేదు, అవకాశం వచ్చాక అడ్డం తిరగలేదు. తలెగరేసినవాడితో తలపడాడ్డు, తల పొగరు దించాడు. అలాగే తనతో పాటు కలిసి అడుగేస్తా అన్నవాడి ముందు తలవంచాడు, తగ్గి నెగ్గాడు. వైసీపీ వ్యూహాలకు రాష్ట్రాన్ని బలికానివ్వను అంటూ పంతం పట్టి వైసీపీని అధః పాతాళానికి తొక్కాడు.

అన్న చాటు తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అన్నను మించిన స్టార్ డమ్ ను సొంత చేసుకున్నప్పటికీ ఎంత ఎదిగిన అన్న ముందు ఒదిగే ఉన్నాడు. విజయం తాలూకా విలువ తెలియని వారికి ఓటమి తాలూకా భయాన్ని చూపించాడు పవన్. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోలేదు, గెలుపు దరి చేరినప్పుడు పొంగి పోలేదు.

ఒక్క విజయం ఎన్నో అవమానాలకు సమాధానం చెప్పింది, ఎన్నో నోళ్లకు తాళం వేసింది. ఈ 2024 పవన్ అభిమానులకు, మెగా ఫాన్స్ కు జనసైనికులకు ఎన్నో తీపి జ్ఞాపకాలను, మరెన్నో తియ్యని అనుభూతులను మిగిల్చిందనే చెప్పాలి. ఒక్క విజయం తాలూకా గౌరవం ఈ స్థాయిలో ఉంటుందా అనేలా జనసేన ప్రస్థానం, పవన్ రాజకీయ ప్రయాణం మొదలయ్యింది.

ఇటు సీనిమాలు, అటు రాజకీయాలు అంటూ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న పవన్ తానూ ఎంచుకున్న రెండు రంగాలలోను మరిన్ని విజయాలను అందుకోవాలని, సినిమాల ద్వారా తన అభిమానులను అలరిస్తూ, రాజకీయం ద్వారా రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు M9 తరుపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

రెండు సీట్ల వీసీకే చేతిలో విజయ్‌ భవిష్యత్‌!

తమిళనాడులో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీ, 73 సీట్లు గెలుచుకున్న డీఎంకే, 53 సీట్లు గెలుచుకున్న అన్నాడీఎంకే మూడూ…

12 minutes ago

The Death of Air-Conditioned Governance

Chief Minister Chandrababu Naidu has officially shattered the comfort of the Secretariat by declaring every…

32 minutes ago