హరీష్, కేటీఆర్ ఇద్దరికీ మంత్రి పదవి ఉండదా?

TRS-Invincible-As-Long-As-KTR-and-Harish-Rao-are-Togetherతెలంగాణాలో కే చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండీ మంత్రివర్గ కూర్పు గురించి చర్చ నడుస్తుంది. పూర్తి స్థాయి విస్తరణ ప్రస్తుతానికి ఉండదని కొంత మందిని మాత్రమే తీసుకుని వేసవిలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల తరువాత మలి విడత మంత్రివర్గ విస్తరణ ఉండబోతుందని సమాచారం. ఈ క్రమంలో హరీష్ రావును పార్లమెంట్ కు పంపిస్తారని రాష్ట్ర కేబినెట్ లో స్థానం దక్కదని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో విషయం వినబడుతుంది.

[m9ad]

ADVERTISEMENT

కుటుంబ పాలన అన్న విమర్శను తప్పించడానికి కెటిఆర్, హరీష్ లు ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వకపోవచ్చని ఒక ఆంగ్ల పత్రిక కదనాన్ని ఇచ్చింది. హరీష్ ను మాత్రమే తప్పిస్తే అనవసరంగా వివాదాలు వస్తాయని కొంత కాలం కేటీఆర్ ను కూడా పక్కన పెట్టి హరీష్ ను పార్లమెంట్ ఎన్నికలలో నిలబెట్టి గెలిపించాకా కేటీఆర్ ను కాబినెట్ లోకి తీసుకొవాలని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. అవకాశం వస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో హరీష్ ను కేంద్ర ప్రభుత్వంలో ఏదో ఒక కేబినెట్ మంత్రిని చేస్తే అధికార మార్పిడి సజావుగా జరుగుతుందని కేసీఆర్ భావన అట.

ఇదే క్రమంలో కేబినెట్ లో కేటీఆర్ కనుసన్నలలో పని చేసే వారిని నియమించడంతో ఆయన మంత్రిగా లేకపోయినా శాఖలపై ఆయన పట్టు సడలకుండా ఉంటుందని కేసీఆర్ వ్యూహమట. అయితే ఈ ప్లాన్ ను హరీష్ రావు వర్గం ఎలా చూడబోతుందో చూడాలి. ఇప్పటికే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ చెయ్యడం ఆ వర్గానికి మింగుడుపడటం లేదు. ఏది ఏమైనా మంత్రివర్గ విస్తరణను ఆలస్యం చేసి కెసిఆర్ పలు ఊహాగానాలకు ఆస్కారం ఇస్తున్నారు. మరోవైపు తెరాసలోని ఒక వర్గం ఈ మొత్తం ఊహాగానాలను కొట్టి పారేస్తోంది.

“హరీష్ రావు, కేటీఆర్ లేని కేబినెట్ ను ఊహించుకోలేం. గత ప్రభుత్వం వారిద్దరూ అత్యంత బాగా పనిచేసిన మంత్రులు. వారిని తప్పిస్తే అది ప్రభుత్వానికి ఇబ్బందిగా పరిణమించవచ్చు. కేసీఆర్ అటువంటి నిర్ణయం తీసుకుంటారని మేము అనుకోవడం లేదు. ఇద్దరూ కేబినెట్ లో ఉండే అవకాశం ఉంది,” అని వారు అంటున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మౌనం వీడి తన కేబినెట్ మంత్రుల జాబితా ను ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. అప్పటివరకు ఇలాంటి ఊహాగానాలు తప్పవు అన్నట్టుగానే ఉంది.

ADVERTISEMENT
Latest Stories