హరీష్‌ రావుకే ఇంత క్లారిటీ ఉంటే…

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీష్‌ రావుని సిట్ అధికారులు నిన్న జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ఏడు గంటల సేపు ప్రశ్నించారు.

బీఆర్ఎస్‌ పార్టీతో సహా అన్ని పార్టీలలో ఈ కేసులో బాధితులున్నారు. వారందరికీ పిలుపులు, వాంగ్మూలాల రికార్డింగులు అయిపోయాయి.

ADVERTISEMENT

తర్వాత ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు, తర్వాత కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు నవీన్ రావులతో బీఆర్ఎస్‌ నేతలకి కూడా పిలుపులు మొదలయ్యాయి.

ఇప్పుడు ఆ పార్టీకి మూల స్థంభం వంటి హరీష్‌ రావుని పిలిచి ప్రశ్నించారు. కనుక సిట్ అధికారులు ఫామ్‌హౌసు వీధిలోకి వచ్చేసినట్లే… అని అందరూ అనుకుంటున్నారు.

కానీ హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఇదంతా సిల్లీ డ్రామా..ట్రాష్! అధికారులు నన్ను ప్రశ్నిస్తుంటే ప్రతీ అర్ధగంటకోసారి ఫోన్లు వస్తుండేవి. రేవంత్ రెడ్డి చేస్తున్నారో… సజ్జనార్ చేస్తున్నారో… తెలీదు కానీ బయట నుంచి కానిస్టేబుల్ సైగ చేయగానే నన్ను ప్రశ్నిస్తున్న ముగ్గురు అధికారులు హడావుడిగా బయటకు వెళ్ళిపోయేవారు.

బయటకు వెళ్ళి ఫోన్లో గంటసేపు మాట్లాడుకున్న తర్వాత వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతూ కాలక్షేపం చేశారు.

నన్ను ఎక్కువ సేపు లోపల కూర్చోబెడితే చాలనుకున్నట్లున్నారు. వాళ్ళ ప్రశ్నలను బట్టి వారి దగ్గర ఒక్క ఆధారం కూడా లేదని నాకు అర్దమైంది,” అని అన్నారు.

రాష్ట్ర రాజకీయాలలో ఈ కేసు ‘గేమ్‌ చేంజర్’ అని పలువురు భావిస్తున్నారు. కల్వకుంట్ల కవితతో సహా వివిధ పార్టీల నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సిట్ అధికారులు కేసీఆర్‌ హయంలో ఫోన్ ట్యాపింగ్‌ జరిగిందని గట్టిగా చెపుతున్నారు.

అందువల్లే బీఆర్ఎస్‌ శ్రేణులు కూడా ఈ కేసుతో ఏదో పెద్ద అనర్ధం జరగబోతోందని ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ కేసు ‘వట్టి ట్రాష్ ఏమీ లేదంటూ’ హరీష్‌ రావు రెండు ముక్కలో తేల్చి చెప్పేశారు. కనుక ఉందని నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, సిట్ అధికారులదే.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Recent Posts

Jailer 2: Poor Planning Kills Rajini’s 1000 Cr Dream?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set for a…

3 hours ago

After Vijay, Will Nayanthara Enter Tamil Nadu Politics?

Vijay’s rise to power in Tamil Nadu has once again brought the spotlight on actors…

3 hours ago