హరీష్ శంకర్ అరుదైన గౌరవం ఇచ్చిన పవన్ కళ్యాణ్

Harish Shankar Pawan Kalyan Movie (1)జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండేళ్ళ గ్యాప్ తరువాత తిరిగి సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమా రెండు రోజులు క్రితం అల్యూమినియం ఫ్యాక్టరీ లో ముహూర్తం జరుపుకుంది.

ఈ లోగా ఆయన మూడవ చిత్రం…. గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ తో ప్రకటించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. గత రెండు సినిమాలకు… ఇప్పుడు ఈ సినిమాకు ఒక తేడా ఉంది. ఆ రెండు సినిమాలు చడీ చప్పుడు లేకుండా మొదలయ్యాయి. దిల్ రాజు పింక్ రీమేక్ చేస్తున్నాం అని ప్రకటించాడు గానీ కనీసం హీరో ఎవరో కూడా చెప్పలేదు.

ADVERTISEMENT

క్రిష్ సినిమాకి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు. అయితే హరీష్ శంకర్ సినిమా మాత్రం నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించడం గమనార్హం. ఇక ఇప్పుడు అభిమానులు హరీష్ గబ్బర్ సింగ్ లాంటి మరో భారీ హిట్ ని ఇస్తాడని నమ్మకం తో ఉన్నారు. ఈ ప్రకటనతో వారంతా ఫుల్ జోష్ తో ఉన్నారు.

ఈ స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకోవడానికి హరీష్ కు కనీసం 10 నెలల సమయం చిక్కుతుంది. ఇది ఇలా ఉండగా ఇన్ని సినిమాలు… రాజకీయాలకు పవన్ కళ్యాణ్ టైం ఎలా కేటాయిస్తారు అనేది చూడాల్సి ఉంది. మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories