హరీష్ ఖాతాలో చాలా పెద్ద వారున్నారు!

harish-shankar-movies‘గబ్బర్ సింగ్’ తర్వాత ఒక్కసారిగా హాట్ డైరెక్టర్ గా మారిపోయిన హరీష్ ను ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం భూమ్మీద నిలబెట్టింది. ఆ తర్వాత ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో మాస్ వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన హరీష్ శంకర్ తదుపరి సినిమాల జాబితాను పరిశీలిస్తే అవాక్కవ్వాల్సిందే!

ADVERTISEMENT

అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నానని ఇప్పటికే ప్రకటించిన హరీష్, మాస్ మహారాజ రవితేజతో బాలీవుడ్ రీమేక్ కు కూడా సిద్ధమవుతున్నవారు. ఈ రెండు కాక, తన గత చిత్రాల హీరోలైన ‘రామయ్యా వస్తావయ్యా’ ఫేం జూనియర్ ఎన్టీఆర్, ‘గబ్బర్ సింగ్’ ఫేం పవన్ కళ్యాణ్ లతో సినిమాలుండే అవకాశాలున్నాయని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ విషయం ఎలా ఉన్నా, జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం ఖచ్చితంగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు హరీష్.

వరుసగా ఇన్ని సినిమాలు చేజిక్కించుకోవడం పట్ల హరీష్ చేసిన మాయ ఏమిటన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. ‘రామయ్యా వస్తావయ్యా’ చిత్రం తర్వాత దాదాపుగా రెండేళ్ల పాటు ఖాళీగా కూర్చొన్న హరీష్ శంకర్ కు గతేడాది విడుదలైన ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా కూడా పెద్ద గుర్తింపును తేలేకపోయింది. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవడం సాధారణ విషయమేమీ కాదని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories