రామ్ – అనుపమ జంటగా నటించిన “హలో గురు ప్రేమకోసమే…” సినిమా ఆడియో యూ ట్యూబ్ లో విడుదలైంది. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఈ ఆల్బమ్ లో మొత్తం అయిదు పాటలుండగా, టైటిల్ పేరుతో సాగిన ‘హలో గురు ప్రేమకోసమే’ అన్న సాంగ్ మాత్రమే జోష్ ఫుల్ గా ఉంటుంది.
[m9ad]
అయితే ఈ ట్యూన్ ను దేవిశ్రీ ఇదివరకే “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాకు ఇచ్చేసి ఉండగా, మళ్ళీ ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమా కోసం రెండవసారి దించేసాడు. చైతూ – రకుల్ లు కలిసి ఆలపించిన ‘భ్రమరాంబకు నచ్చేసాను… అంబరమే టచ్ చేశాను…’ అన్న ట్యూన్ నే ‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ వినిపించారు.
మిగిలిన నాలుగు పాటలలో ఒకటి రామ్ – ప్రకాష్ రాజ్ లు కలిసి ఆలపించారు. ‘ఐడియా చెప్పు ఫ్రెండ్’ అన్న ఈ పాటలో వచ్చే మ్యూజిక్ తో పాటు ‘ఫ్రెండ్… ఫ్రెండ్… కొంచెం మార్చు ట్రెండ్…’ అన్న పదాలు వినసొంపుగా ఉన్నాయి. మిగతావన్నీ ఆల్బమ్ లో ‘అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి,’ అవి ఎవరికీ గుర్తుండవు కూడా..!



