ఈ ‘హాట్ కాఫీ’ జంట బాగుంది!

Hello Guru -Prema Kosame release on 18rth Octoberఎనర్జిటిక్ స్టార్ రామ్ – క్యూట్ బ్యూటీ అనుపమ జంటగా తెరకెక్కుతోన్న “హలో గురూ ప్రేమ కోసమే” సినిమాను దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ పబ్లిసిటీలో భాగంగా ఓ నాలుగు పోస్టర్స్ ను సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఇటీవల విడుదలైన టీజర్ ‘హాట్ కాఫీ’ అంటూ వేసిన డైలాగ్స్ ఎంత బాగున్నాయో, దానికి సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసి మరోసారి టీజర్ ను గుర్తు చేసారు. రామ్ – అనుపమలు పక్కనపక్కనే ఉన్న ఈ పోస్టర్ చూడముచ్చటగా ఉంది. బ్లూ కలర్ షేడ్స్ లో రిలీజ్ చేసిన ఇతర పోస్టర్లలో కూడా వీరిద్దరి జంట ప్రేక్షకులకు కన్నులవిందు చేస్తుందన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి.

ADVERTISEMENT

సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరపరిచిన ఆడియో సోమవారం నుండి యూ ట్యూబ్ లో అందుబాటులో ఉండనుంది. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు జస్ట్ ‘ఓకే’ మార్కులు సంపాదించుకున్నాయి గానీ, ‘నేను శైలజ’ మాదిరి ఇన్ స్టంట్ హిట్స్ గా నిలవలేకపోయాయి.

ADVERTISEMENT
Latest Stories